telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

ఆక్స్ ఫర్డ్ నిఘంటువులో .. చడ్డీస్(ఇది భారతీయ పదం) !

Indian word chuddis placed in oxford dictionary

నిఘంటువు అనగానే గుర్తొచ్చేది ఆక్స్ ఫర్డ్. అంత గొప్ప నిఘంటువు కూడా ప్రతి ఏడాది ఎన్నో సరికొత్త పదాలను తనలో ఇముడ్చుకుంటుంది. ఈ పదాలు వివిధ ప్రాంతాలు, దేశాల నుండి తీసుకోవడం విశేషం. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో భారతీయ పదాలు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చోటు దక్కించుకున్నాయి.

భారతీయులు ‘లోదుస్తులు’ అనే అర్థం వచ్చేలా పలికే ‘చడ్డీస్’ అనే పదాన్ని కూడా ఆక్స్ ఫర్డ్ నిఘంటువులోకి ఎక్కించారు. ఈ డిక్షనరీలో చడ్డీస్ అనే పదానికి షార్ట్ ట్రౌజర్స్, అండర్ ప్యాంట్స్, షార్ట్స్ అనే అర్థాలు కనిపిస్తాయి. ఈ పదం అప్పటి బ్రిటీష్ పాలకులకు కూడా సుపరిచితమే. భారత్ లో బ్రిటీష్ పాలన కొనసాగిన కాలంలో వారి అధికారిక గెజిట్లు, ఇతర ప్రచురణల్లో చడ్డీస్ పదాన్ని ఉపయోగించేవాళ్లు. కాగా, తాజా వెర్షన్ లో ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో 650 కొత్త పదాలకు స్థానం కల్పించారు.

Related posts