telugu navyamedia
క్రీడలు వార్తలు

పృథ్వీ షాకు షాక్ ఇచ్చిన పోలీసులు…

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఐపీఎల్‌ 2021 సీజన్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసినా విషయం తెలిసిందే. సజావుగా సాగుతున్న లీగ్‌లోకి దూసుకొచ్చిన వైరస్ వేగంగా ఆటగాళ్లకు సోకింది. దాంతో ప్లేయర్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని లీగ్‌ను తాత్కలికంగా రద్దు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షా ఇటీవల హోం ఐసోలేషన్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ విరామ సమయాన్ని గోవాలో ఆస్వాదిద్దామనుకున్నాడు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ కేంద్రం అన్ని విమానాలపై నిషేధం విధించింది. దీంతో తన సొంత కారులోనే పృథ్వీ షా గోవాకు బయలుదేరాడు. అయితే కరోనా విజృంభిస్తున్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్న ఈ పాస్‌ ఉంటేనే పోలీసులు అనుమతిస్తున్నారు. పృథ్వీ షా వద్ద ఈపాస్‌ లేకపోవడంతో అంబోలీ జిల్లా చెక్‌పోస్టు వద్ద పోలీసులు అతని కారును అడ్డుకున్నారు. అనుమతి లేకుండా గోవా వెళ్లడం కుదరదన్నారు. పృథ్వీ షా ఎన్నిసార్లు అడిగినా పోలీసులు ఒప్పుకోకవడంతో.. గంటపాటు వేచిఉండి తన మొబైల్‌ నుంచే ఈ పాస్‌‌కు దరశాస్తు చేశాడు. అనుమతి వచ్చిన తర్వాత పోలీసులకు చూపించి బయల్దేరాడు. ఇక ఆసీస్‌ పర్యటనలో ఘోరంగా విఫలమై జట్టు నుంచి ఉద్వాసనకు గురైన పృథ్వీ షా ఆ తర్వాత దేశవాలీ టోర్నీ అయిన విజయ్‌ హజారే ట్రోపీలో దుమ్మురేపాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్‌ 2021 సీజన్‌లోనూ అదే జోరును కంటిన్యూ చేశాడు.

Related posts