telugu navyamedia
రాజకీయ విద్యా వార్తలు

ఇకనుండి.. సంస్కృతి .. పాఠాలలో కూడా…

అన్ని చదువులు పాతకాలం నాటి వానాకాలం చదువులకంటే ఘోరంగా మారిపోయాయని; చదువు పూర్తిచేసుకుని బయటకు వచ్చిన విద్యార్థికి కనీస సంస్కారాలు కూడా ఉండటంలేదని మొత్తానికి విద్యావిధానం గురించి కేంద్రప్రభుత్వానికి అర్ధం అయినట్టుగానే ఉంది. అందుకే ఇక నుండి భారత సంస్కృతిని విదార్థులకు ఆయా తరగతులలో బోదించనున్నారట. అందుకు ఒక విధానం కూడా ప్రవేశపెడుతున్నారు. అదే, భారతీయ సంస్కృతి, వారసత్వ అంశాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచడంతో పాటు వారిలో ఆసక్తిని, అనురక్తిని పెంచేందుకు వీలైన పాఠ్యాంశాలను వివిధ తరగతుల్లో చేర్చాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌లోనూ మార్పులు చేయనుంది.

ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగుణంగా రాష్ట్రాల సిలబస్‌లో కూడా మార్పులు చేస్తారు. వైదిక సంస్కృతిని కూడా ఈ కొత్త సిలబస్‌లో చేరుస్తారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారతీయ శిక్షా బోర్డును ఏర్పాటు చేయనుంది. అయితే దీనిని రెగ్యులర్ సిలబస్‌లో చేర్చాలా లేదా సమాంతరంగా ఒక బోర్డును ఏర్పాటు చేసి హిందీ పరీక్షలు నిర్వహించి వారికి సర్ట్ఫికేట్లు జారీ చేస్తున్న రీతిలోనే వేదిక్ విద్యను అందించి, వివిధ గ్రేడ్‌లతో కూడిన పరీక్షలను నిర్వహించి సర్ట్ఫికేట్లు జారీ చేయాలా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఈ అంశంపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోంది. ఒక వారంలో బోర్డు తీరతెన్నులపై సమీక్ష నిర్వహిస్తారు. బోర్డుకు ఒక రూపకల్పన ఇచ్చి తదుపరి చర్యలు చేపట్టాలని కేంద్రం ఆలోచనలో ఉందంట. ఎన్నికల దగ్గర పడగానే ఎంత జ్ఞానోదయం అవుతుందో.. ప్రభుత్వాలకు.. ముందేమైందో ఈ మాత్రం ఆలోచనలు.. అంటూ దీనిపై అప్పుడే విమర్శలు కూడా గుప్పిస్తున్నారు ప్రతిపక్షాలు.

Related posts