నేడు పాక్ భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చివేశామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఐఏఎఫ్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్నామని వెల్లడించింది. ఆయన పేరు విక్రమ్ అభినందన్ అనీ, విక్రమ్ భారత వాయుసేనలో వింగ్ కమాండర్ గా పనిచేస్తున్నారని పేర్కొంది. ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా పాక్ విడుదల చేసింది. కాగా, భారత యుద్ధ విమానాలను కూల్చివేశామన్న పాకిస్థాన్ వాదనలను భారత్ ఖండించింది.
భారత్ వాయుసేనకు చెందిన పైలెట్లు అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపింది. పాకిస్థాన్ చెరలో భారత పైలెట్లు ఎవ్వరూ లేరని స్పష్టం చేసింది. పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాద స్థావరంపై నిన్న భారత వాయుసేన దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 350 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై నాగబాబు కామెంట్స్