telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

రేపటి నుండే టెస్ట్ .. మాంచి ఫామ్ లో ఉన్న టీం ఇండియా ..

india vs bangladesh test from tomorrow

రేపటి నుండి భారత్-బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇండియా ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉంది. టెస్టుల్లో అయితే ఇండియా నెంబర్‌వన్ పొజిషనల్‌లో కొనసాగుతోంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో సైతం 240 పాయింట్లతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ అయితే ఇటీవల ఆడిన టెస్టులో తన కన్నా తక్కువ ర్యాంక్ ఉన్న ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయింది. పైగా కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. ఆల్‌రౌండర్ షకీబ్ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటు. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ సైతం లేకపోవడం జట్టుకు ఇబ్బందికర పరిస్థిని తీసుకొచ్చింది.

టీ 20 సిరీస్‌లో ఇండియాకు గట్టి పోటీనే ఇచ్చిందని చెప్పొచ్చు. మొదటి మ్యాచ్ గెలిచిన బంగ్లా.. తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లోను ఓడిపోయి, సిరీస్‌ను ఇండియాకు అప్పగించింది. ఒకరిద్దరు ఆడినా..జట్టుగా ఆడడంలో బంగ్లా విఫలమౌతోంది. ఇండియా విషయానికొస్తే.. కెప్టెన్ కోహ్లినే జట్టుకు అదనపు బలం. బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణిస్తూ, సహచరులకు స్ఫూర్తినిస్తుంటాడు. ఓపెనర్లు రోహిత్, మయాంక్ అగర్వాల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్‌గా ప్రమోట్ అయిన మొదటి సిరీస్‌లోనే రోహిత్ తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. రెండు సెంచరీలు సహా, డబుల్ సెంచరీ సాయంతో సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మయాంక్ అయితే రెండు సెంచరీలు బాదాడు. టెస్టు స్పెషలిస్టు పుజారా ఉండనే ఉన్నాడు. వైస్ కెప్టెన్ రహానే సైతం కీలక సమయాల్లో రాణిస్తూ, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వికెట్ కీపర్‌గా పంత్‌కు బదులు సాహా కొనసాగనున్నాడు. బౌలర్లలో షమీ, ఇషాంత్, ఉమేష్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఆల్ రౌండర్లలో జడేజా లేదా అశ్విన్‌కు చోటు దక్కవచ్చు. మొత్తానికి జట్టుగా చూసుకుంటే, టీమిండియా చాలా బలంగా ఉంది. మరి ఇండియాను, బంగ్లా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి!

Related posts