telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో అపార అవకాశాలు: కేటీఆర్‌

ktr trs president

రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో అపార అవకాశాలున్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మాదాపూర్‌లో ఇండియా-థాయ్‌లాండ్‌ మ్యాచింగ్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. థాయ్‌లాండ్‌ నుంచి భారత్‌కు గేట్‌వేగా తెలంగాణతో అనుసంధానం చేయాలని అన్నారు. రబ్బర్‌వుడ్‌ పరిశ్రమలో థాయ్‌లాండ్‌ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నదని మంత్రి తెలిపారు.

తెలంగాణలో వాణిజ్యరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా అవకాశాలున్నాయని మంత్రి తెలిపారు.. భారత్‌తో థాయ్‌లాండ్‌ కు చాలా మంచి సంబంధాలున్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం దేశ వృద్ధిరేటును మించి అభివృద్ధి చెందుతోందని అన్నారు. రాష్ట్రంలో ఫర్నిచర్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని థాయ్‌లాండ్‌ ఉప ముఖ్యమంత్రిని మంత్రి కేటీఆర్‌ కోరారు.

Related posts