telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

8 వికెట్ల తేడాతో రెండో టెస్ట్ లో విజయం సాధించిన భారత్…

రెండో టెస్టులో భారత్ ఆసీస్ పై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో మూడోరోజు ఆట ముగిసే సమయానికి కీలకమైన ఆరు వికెట్లను కోల్పోయి 133 పరుగులు చేయగా.. నాల్గో రోజు ఆట ప్రారంభించిన ఆతిథ్య ఆసీస్ జట్టు 67 పరుగులు సాధించి మిగత నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకు ఆలౌట్ అయ్యింది.. ఇక, 70 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ ముందు పెట్టింది… 70 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.. శుభ్‌మన్ గిల్(35 నాటౌట్), రహానే(27 నాటౌట్) పరుగులతో భారత్‌ను గెలిపించారు. దీంతో.. అడిలైడ్ టెస్ట్‌లో దారుణంగా ఓడిపోయిన భార‌త్ ఇప్పుడు అందుకు త‌గ్గ ప్రతీకారం తీర్చుకుంది. ఆతిథ్య జ‌ట్టు ఆప‌సోపాలు ప‌డ్డ పిచ్‌పై మ‌న బౌల‌ర్స్‌, బ్యాట్స్‌మెన్స్ అద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌రిచి ఎనిమిది వికెట్ల తేడాతో రెండో టెస్ట్‌లో ఘ‌న విజయం సాధించారు.అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 195 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ కొద్దిగా ఇబ్బంది ప‌డ్డ‌ప్ప‌టికీ తొలి ఇన్నింగ్స్‌లో 326 ప‌రుగులు చేశారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స‌రిగ్గా 200 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. ఆతిథ్య జట్టులో గ్రీన్ 45, వేడ్ 40, లబుషేన్ 28, కమిన్స్ 22 కాసేపు ప్రతిఘ‌టించ‌డంతో భార‌త్ విజయం కాస్త లేట్ అయింది.. మొత్తానికి 70 ప‌రుగుల ల‌క్ష్యంతో లంచ్‌ విరామం అనంతరం బ్యాటింగ్ చేప‌ట్టిన టీ మిండియా ఆదిలో రెండు వికెట్లు వెంట వెంట‌నే కోల్పోయింది. 5 పరుగులు చేసి ఓపెనర్ మయాంక్ అగ‌ర్వాల్ ఔట్ కాగా.. మూడు పరుగులు చేసి పుజారా పెవిలియన్ చేరాడు.. ఇక, శుభ్‌మ‌న్ గిల్(35) , కెప్టెన్ ర‌హానే(24)తో క‌లిసి భార‌త్‌ను విజయాన్ని అందించారు. దీంతో సిరీస్ 1-1తో స‌మం అయింది. చూడాలి మరి తర్వాతి మ్యాచ్ లో విజయం ఎవరిది అనేది.

Related posts