telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

భారత్ కు కూడా .. ప్రత్యేక స్పేస్ స్టేషన్ .. : ఇస్రో

india may have own space station soon

భారత దేశానికి అంతరిక్షంలో ప్రత్యేక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇస్రో(భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) చైర్మన్ డాక్టర్ శివన్ తెలిపారు. గగన్‌యాన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇది చాలా చిన్న కేంద్రమని, మైక్రోగ్రావిటీ ప్రయోగాల నిర్వహణకు దీనిని ఉపయోగించవచ్చునని ఆయన వివరించారు. ఈ స్పేస్ స్టేషన్ ప్రణాళికను రాబోయే 10 ఏళ్ళలో రూపొందిస్తామన్నారు. దీనికయ్యే ఖర్చును ఇంకా అంచనా వేయలేదన్నారు.

ప్రస్తుతం తమ దృష్టి అంతా జూలైలో ప్రయోగించే చంద్రయాన్ -2పైనా, 2022లో ప్రయోగించే గగన్‌యాన్‌పైనా ఉందని తెలిపారు. గగన్‌యాన్ భారత దేశ తొలి మానవ సహిత కార్యక్రమమని తెలిపారు. గగన్‌యాన్‌ ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్తుందన్నారు. రాబోయే 6 నెలల్లో ఈ వ్యోమగాముల ఎంపిక పూర్తవుతుందని తెలిపారు. ఎంపికైనవారికి దాదాపు రెండేళ్ళపాటు కఠోర శిక్షణ ఇస్తామని శివన్ స్పష్టం చేశారు.

Related posts