telugu navyamedia
రాజకీయ వార్తలు

యాప్స్ నిషేధం ఉద్దేశపూర్వక తప్పు: భారత్ పై చైనా ఆరోపణ

china apps banned

ఇటీవల 59 చైనా యాప్ లపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా ఘాటుగా స్పందించింది. యాప్స్ ను నిషేధించడం, ఇండియా చేసిన ఉద్దేశపూర్వక తప్పని పేర్కొంది. వెంటనే తప్పును సరిదిద్దుకోవాలని చైనా హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు చైనా ఎంబసీ అధికార ప్రతినిధి జీ రోంగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. వుయ్ చాట్ నిషేదంపై భారత ప్రభుత్వంతో తాను మాట్లాడినట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు చైనా నేపథ్యం ఉన్న 59 యాప్స్ ను బ్యాన్ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ఇండియా నిర్ణయంతో చైనా కంపెనీల చట్టబద్ధమైన హక్కులకు తీవ్ర విఘాతం కలిగిందని వెల్లడించారు. ఈ చర్యలతో దౌత్య పరమైన సంబంధాలూ దెబ్బతింటున్నాయన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఇక్కడి ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు.

Related posts