telugu navyamedia
క్రైమ్ వార్తలు

గ్యాంగ్​స్టర్​ నయీం కేసులో కీలక మలుపు.. 150 కోట్ల విలువైన ఆస్థుల సీజ్‌..

*నయీం కేసులో కీలక మలుపు
*పది ఆస్తులను సీజ్ చేసిన ఐటీ అధికారులు
*వాటి విలువ రూ.150 కోట్ల వరకు ఉంటుందని అంచనా

కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. నయీంకు చెందిన సుమారు 150 కోట్ల విలువైన ఆస్థులను ఐటిశాఖ సీజ్‌ చేసింది.

రాష్ట్రంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గ్యాంగ్‌స్టర్ నయీం..సుమారు పది సంవత్సరాల పాటు ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నయిం భూకబ్జాలు, మర్డర్ కేసులతో నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు. 2016 షాద్‌నగర్‌లో జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. అనంతరం నార్సింగిలోని నయీం ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు.

దీంతో ఆయన ఎన్ కౌంటర్ తర్వాత నయీం ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. భారీగా ఆస్తులు వెలుగు చూశాయి.. ఈ క్రమంలోనే నయీం ఆస్థులపై ఐటిశాఖ రంగంలో దిగింది.

బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసి ఉన్న 10 ఆస్తులను అధికారులు ఇప్పటి వరకు జప్తు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నయీం బినామీల పేరు మీద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్, అగ్రికల్చరల్ లాండ్స్ ఇందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆస్తులను సీజ్‌ చేసింది..

మొత్తం 45 ఆస్తులు ఉన్నట్టు గతంలోనే ఐటీ శాఖ గుర్తించగా.. అందులో పది ఆస్తులను ఇప్పుడు సీజ్‌ చేశారు అధికారులు..ఈ పది ఆస్తుల విలువే సుమారు 150 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో జప్తు చేసిన ఆస్ధులన్ని ఆదాయపు శాఖ ఆధీనంలోకి వెళ్లనున్నాయి.

 

Related posts