telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మరో అల్పపీడనం… ప్రజలను అప్రమత్తం చేసిన ఐఎండీ

will be huge rains in 2 telugu states

భారత్‌కు మరో తుఫాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా తమిళనాడు, కేరళా రేవు ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ కోరింది. దీనికి కారణంగా బంగాళా ఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటమే నని తెలిపింది. ప్రస్తుత వాతావరణం ప్రకారం మరో అల్పపీడనం గాలులు భారత్‌వైపుకి వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది. కొన్ని గంటల వ్యవధిలోనే మరో తుఫాను భారత్‌ను తాకనుందని అధికారులు అన్నారు. అయితే ఈ అల్పపీడనం బంగాళా ఖాతంలోని నైఋతీ దాక్కు నుంచి వాయువ్యం వైపుకు కదులుతుందని తెలిపారు. మరో 2330 గంటల కాలంలో దాదాపు 590 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. అయితే ఈ అల్పపీడం బలపడి తుఫాను వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం గంటకు 7కిలోమీటర్ల వేగంతో కదులుతోందని తెలిపడంతో పాటు ఈ అల్పపీడనం లాటిట్యూడ్‌ను తెలిపారు. 7.8ఎన్, 86.6ఈ లాటిల్యూడ్‌లతో శ్రీలంక మీదుగా కదులుతోందని సమాచారం. శ్రీలంకకు 590 కిలోమీటర్ల దూరం, కన్యాకుమారికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో ఆరుగంటల్లో మరింత బలపడే అవకాశాలు ఎక్కవగా కనిపిస్తున్నాయని, మరో 12గంటల్లో తుఫానుగా మరవచ్చని తెలిపారు. ఈ అల్పపీడనం 7.5ఎన్, 9.00ఎన్‌ లాటిట్యూడ్‌లతో డిసెంబరు 2 రాత్రికి శ్రీలంక రేవును చేరుతుందని తెలిపారు. దానితో పాటుగా ఈ అల్పపీడనం తమిళనుడు వైపుకు కదులుతోందని ఐఎండీ తెలిపింది. తుఫాను తమిళనాడు మీదుగా కేరళలోకి ప్రవేవించేందుకు అవకావాలు ఉన్నాయని తెలపడంతో పాటుగా దక్షిణ కేరళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Related posts