telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాయ్ ఫ్రెండ్ తో ఇలియానా బ్రేకప్ ?

Ileana

గత కొంతకాలంగా గోవా బ్యూటీ ఇలియానా ఓ ఫారెన్ ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది ఈ బ్యూటీ. ఈ జంటగా సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని టాక్. ప్రస్తుతం ముంబైలో వీరిద్దరూ కలిసే జీవిస్తున్నారు. అయితే లండన్ కి చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో కలిసి దిగిన ఫోటోలను ఇలియానా సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా గతేడాది క్రిస్మస్ సందర్భంగా ఇలియానా ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి “ఈ ఫోటో తీసిన నా హబ్బీ” అంటూ పోస్ట్ చేసింది. ఆ సమయంలో ఇద్దరికీ పెళ్లి అయిపోయిందనే వార్తలు బలంగా వినిపించాయి. ఈ విషయంపై ఇలియానాని ప్రశ్నించగా.. తనకు సమాధానం చెప్పడం ఇష్టం లేదని, తన వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగానే ఉంచాలనుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఇప్పుడు ఈ జంట విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆండ్రూతో ఉన్న ఫొటోల్ని ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తొలగించారు. అంతేకాదు ఇద్దరు ఒకర్నొకరు అన్‌ఫాలో అయ్యారు. దీంతో బాలీవుడ్‌లో వీరి బ్రేకప్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. పలు మీడియా ఛానెల్స్ వార్తలను ప్రచురించాయి. కొన్నేళ్లుగా కలిసున్న ఈ జంట విడిపోవడానికి కారణం ఏంటని కథనాలు ప్రచురిస్తున్నాయి. మరి ఈ విషయంపై ఇలియానా స్పందిస్తుందా ? అనేది చూడాలి.

Related posts