rahul iftar party

ఢిల్లీ లో రాహుల్ ఇఫ్తార్

22

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు ఇఫ్తార్ పార్టీ ఇవ్వనున్నారు. ఈ పార్టీ కి దేశంలోని 450 మంది ప్రముఖులు హాజరుకానున్నారు. 18 ప్రతిపక్ష పార్టీలను ఇఫ్తార్ కు ఆహ్వానించారు. ఆరెస్సెస్ సమావేశం తర్వాత తొలిసారి ఈ పార్టీ లో ప్రణబ్ రాహుల్ ని కలవబోతున్నారు. ప్రతి సంవత్సరం ఇఫ్తార్ ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం ఆనవాయితీగా జరుగుతుంది. ఎప్పుడు ఇఫ్తార్ ఇచ్చే రాష్ట్రపతి భావన్ మైనారిటీ శాఖ ఈ సంవత్సరం ఇఫ్తారును ఇవ్వడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈ పార్టీ కి కాంగ్రెస్ ఆహ్వానించలేదు. ములాయంసింగ్, శరద్ పవర్, చంద్ర బాబు నాయుడు కూడా ఇఫ్తార్ కు హాజరు కాబోతున్నట్టు సమాచారం.