ఇప్పటికే థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్న ‘ఇచ్చట వాహనాలు నిలువ రాదు’ సినిమా ఈ నెల 17 వ తేదీన ఆహా ఓ టీ టీ ద్వారా విడులవుతుందని హీరో సుశాంత్ తెలిపారు. నగరంలో ఓ హొటల్లో జరిగిన మీడియా సమావేశంలో హీరో సుశాంత్ మాట్లాడుతూ.. సినిమా ఇప్పటికే ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది అన్నారు. తన సినిమాలలో ఇది బెస్ట్ చిత్రం గా నిలిచింది. ఇప్పుడు ఆహా ఓటీటీ ద్వారా అందరికీ చేరువవుతున్నారు. ఈ చిత్రంలోని అరుణ్ పాత్ర పక్కింటి అబ్బాయిలా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. అద్భుతమైన కథను అందించినందుకు దర్శకుడికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ చిత్రం ఒక సస్పెన్స్-రొమాంటిక్-డ్రామా గా హిట్ అవ్వడం తో పాటు తన నటనకు మంచి మార్కులు వచ్చాయి అన్నారు. కుటుంబసమేతంగా,స్నేహితులతో కలిసి చూడగలిగే సినిమా అని సుశాంత్ తెలిపారు. విశాఖ సీతమ్మధార లో తన మేనత్త ఇంటికి తరచూ వచ్చే వాడిని అన్నారు. విశాఖ అంటే చాలా ఇష్టం. ఇక్కడ కు వస్తే గొప్ప ఫీల్ కలుగుతుంది అన్నారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ తన మొదటి సినిమా ఎంతోమందిని ఆకట్టుకుందని తెలిపారు. డెంటల్ డాక్టర్ వృతి నుంచి సినిమా హీరోయిన్ గా పరిచయం చేసిన చిత్ర నిర్మాతలకు,దర్శకునికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువ అయ్యాను అన్నారు.
దర్శకుడు ఎస్ దర్శన్ మాట్లాడుతూ నిజ జీవితంలో తన స్నేహితులు ఎదుర్కొన్న కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా కథను తయారు చేసినట్లు తెలిపారు. ఇచ్చట వాహనాలు నిలుపరాదు అన్న అంశం ఆధారంగా మొత్తం చిత్రం నడుస్తుంది. సుశాంత్ ఈ ప్రాజెక్ట్ కోసం ఇతర ప్రాజెక్ట్‌లను వదులుకొన్నారని తెలిపారు. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా సినిమా ప్రియులందరికీ ఈ సినిమా దగ్గరవుతుందన్నారు. ఈ చిత్రం కు విజయం చేకూర్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఏ1 స్టూడియోస్ మరియు శాస్త్రా మూవీస్ బ్యానర్.పై నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ దర్శన్ రచన మరియు దర్శకత్వం వహించారు. నిర్మాతలు గా రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, మరియు హరీష్ కోయలగుండ్ల వ్యవహరించారు.
నిర్మాత పడకగదికి రమ్మన్నాడు…నటి ఆరోపణలు