telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ధోనీపై .. స్వయంగా ఐసీసీ ట్రోలింగ్.. అభిమానుల ఆక్రోశం..

icc trolling on dhoni causes his fans angry

భారత ఆటగాళ్లు ప్రపంచ కప్ లో ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఆయా ఆటగాళ్లపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ధోనీపై ఈ విమర్శలు చాలా ఎక్కువే వస్తున్నాయి. స్వయంగా ఐసీసీ కూడా చేస్తుందంటే.. చూడండి. దీనికి కారణంగా, ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘోరంగా ఓటమిపాలవటం. ఇది భారత్ అభిమానులకు తీవ్ర నిరాశే. ఈ గాయంపై కారం చల్లినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ధోని రన్ ఔట్ పై ఓ వీడియో తీసింది. ఈ వీడియో ద్వారా ఐసీసీ ధోనిని కించపరిచిందని అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. ఈ మ్యాచ్ లో కివీస్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ విసిరిన డైరెక్ట్ త్రోకు ధోని ఔట్ అయ్యాడు. దానిని ఆధారంగా చేసుకుని ఐసీసీ ఓ వీడియోను రూపొందించింది. ఇందులో గప్టిల్‌ను టెర్మినేటర్ సిరీస్ కండల హీరో ఆర్నాల్డ్ ష్క్వార్జ్‌నెగ్గర్‌లా చిత్రీకరించింది.

గప్టిల్ స్టంప్స్‌ను గురి చూడటం, వాటిని టార్గెట్‌గా చేసుకుని బంతిని నిప్పు కణికలా విసరడం, వికెట్లకు తగిలిన ఆ బంతి బాంబులా పేలిపోవడం.. ఇవన్నీ గ్రాఫిక్స్ ద్వారా తీర్చిద్దిదారు. ఐసీసీ అధికారిక ట్విట్టర్ లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు భారత్ అభిమానులు ధోనిని కించపరిచేలా దీన్ని రూపొందించారని మండిపడుతున్నారు. ఈ వీడియోను వెంటనే డిలేట్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు మ్యాచ్ పోయి బాధలో ఉంటే.. గాయంపై కారం చల్లేలా ప్రవర్తిస్తారా అని ట్విట్టర్ వేదికగా నిలదీస్తున్నారు.

Related posts