telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజకీయాలకు అతీతంగా నారా లోకేష్ ను అభినందిస్తున్నాను: విష్ణువర్ధన్ రెడ్డి

తిరుమల శ్రీవారి దర్శించుకున్న బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి, టీటీడీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాన్ని అభినదిస్తున్న అని అన్నారు.

హిందూ ధర్మాన్ని విశ్వసించే వ్యక్తులను స్వామివారి సేవలో పనిచేసేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది అని అన్నారు.

అన్యమత ఉద్యోగస్తులకు సంబంధించిన విషయంలో టీటీడీ వేగవంతమైన చర్యలు తీసుకోవాలి, రాష్ట్రంలో ఇతర దేవాలయాల్లో కూడా అన్యమత ఉద్యోగస్తులు పనిచేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి వాటి మీద కూడా రాష్ట్ర దేవాదాయ శాఖ సమగ్రమైన చర్యలు తీసుకోవాలి అని కోరారు.

రాయలసీమలోని కాశీరెడ్డి నాయన యోగికి సంబంధించిన నిర్మాణాలు అధికారులు కూల్చివేయడం బాధాకరం  ఈ వ్యవహారంపై నారా లోకేష్ ప్రకటన నూతన రాజకీయాలకు నిదర్శనం అని అన్నారు.

ఒక భక్తుడిగా నారా లోకేష్ సొంత నిధులతో పునర్ నిర్మాణం చేస్తామని మంచి ప్రకటన చేశారు అన్నారు.

Related posts