telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హైపర్ ఆదిపై జాతీయవాదులు ఫైర్… స్ట్రాంగ్ వార్నింగ్

Hyper-Adi

బుల్లితెరపై పాపులర్ అయిన “జబర్దస్త్” కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ఎంతగానో ప్రజాదరణ పొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రేటింగ్స్ విషయంలో కూడా జబర్దస్త్ ఎప్పుడూ అందనంత ఎత్తులోనే ఉంటుంది.ఈ షోలో పాల్గొన్న చాలామంది తమ టాలెంట్ ను నిరూపించుకుని సినిమాలలో కూడా ఛాన్సులు కొట్టేస్తున్నారు. ఇక కమెడియన్ హైపర్ ఆది కూడా “జబర్దస్త్”తోనే స్టార్ కమెడియన్ స్టేటస్ అందుకున్నాడు. జబర్ధస్త్ షోలో హైపర్ ఆది కామెడీ కోసమే చూసేవాళ్లన్నారంటే అతిశయోక్తి కాదు. “జబర్దస్త్”లో తన పంచ్ లు బాగా పేలడంతో సినిమాల్లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ హైపర్ ఆది పంచ్‌లు మాత్రం పేలలేదు. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పి ..తనకు అచ్చొచ్చిన “జబర్ధస్త్” షోనే నమ్ముకున్నాడు. అయితే తాజాగా హైపర్ ఆది వేసిన ఓ గెటప్ వివాదాస్పదంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన “సైరా నరసింహా రెడ్డి” గెటప్ ను జబర్దస్త్ స్కిట్ లో వేసి ఆది వివాదానికి కేంద్ర బిందువయ్యాడు. తన 151వ చిత్రంగానూ, అలాగే చరిత్రలో నిలిచిపోయే కేరక్టర్ పోషించిన చిరంజీవికి “సైరా నరసింహారెడ్డి” ఒక మైలురాయి అనే చెప్పవచ్చు. అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు చిరంజీవి జీవం పోశాడని పలు ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ స్వాతంత్ర్య పోరాట యోధుడిని నవ్వులాటగా చూపిస్తూ జబర్దస్త్ లాంటి స్కిట్లు రూపొందించడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గతంలో బాలకృష్ణపై కూడా హైపర్ ఆది కామెడీ స్కిట్స్ రూపొందించడంపై ఆయన అభిమానులు ఫైర్ అయ్యారు. అయితే దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరుల చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసే చిత్రాలను ఇలా అవహేళన చేయడం తగదని పలువురు జాతీయవాదులు ఫైర్ అవుతున్నారు.

Related posts