సుదీర్ఘ చరిత్ర గల హైదరాబాద్ నిజాం కళాశాలకు న్యాక్ అక్రిడేషన్‌లో బి ప్లస్, ప్లస్ గ్రేడ్ వరించింది. కాగా ఫిబ్రవరిలో న్యాక్ అక్రిడేషన్ గ్రేడ్ సందర్భంగా ఫిబ్రవరిలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ సభ్యులు, మార్చిలో రెండు రోజుల పాటు న్యాక్ పీర్ కమిటీలు సందర్శించి అన్ని వివరాలు సేకరించారు. ఢిల్లీకి చెందిన న్యాక్ కమిటీ నుంచి కళాశాలకు న్యాక్ బి ప్లస్, ప్లస్ గ్రేడ్ వరించిందని ఈ మెయిల్ ద్వారా సమాచారం అందించారని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ పేర్కోన్నారు. ప్రపంచదేశాల్లో నిజాం కళాశాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని, కళాశాలకు ఏ ప్లస్, ప్లస్ గ్రేడ్‌ను కోరుతూ మరోమారు రివ్యూకు వెళ్లినట్లు వివరించారు.
previous post