telugu navyamedia
క్రైమ్ వార్తలు

సోష‌ల్‌ మీడియాలో గ్యాంగ్‌ రేప్ బాధితురాలి వీడియోలు.

జూబ్లీహిల్స్ మైన‌ర్ బాలిక గ్యాంగ్‌ రేప్ ఘటన వీడియోలు, ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో గమనించిన తల్లిదండ్రులు ఆ విషయాన్ని మహిళా పోలీసు విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫొటోలు, వీడియో లింక్ ల వివరాలను అందించింది.

దీనిపై స్పందించిన మహిళా భద్రతా విభాగం అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు సూచించారు. ఫిర్యాదు ఆధారంగా వీడియోలను అప్‌లోడ్ చేసిన నెటిజన్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ నగర పోలీసులు భావిస్తున్నారు.

మే 28వ తేదీన మైనర్ బాలికపై సాదుద్దీన్‌తో పాటు నలుగురు మైనర్ బాలురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోలు జూన్ 3, 4వ తేదీల్లో ఈ వీడియోలు, ఫొటోలను అప్ లోడ్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.వైరల్ ఫోటోలో, బాధితురాలి మెడపై గాయం గుర్తులు కూడా ఉన్నాయి.బాలిక ముఖం కనిపిస్తుండడం పట్ల బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేశారు.

Related posts