telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

అమీర్ పేట మెట్రో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సేఫ్టీ కమిషనర్

metro ameerpet hyd

హైదరాబాద్ లోని అమీర్ పేట మెట్రో రైల్వే స్టేషన్ వద్ద పైనుంచి సిమెంటు పెచ్చులు పడి ఆదివారం మౌనిక అనే వివాహిత మృతి చెందిన విషయం తెలిసిందే. కేపీహెచ్‌బీకి చెందిన మౌనిక వర్షం పడుతుండటంతో అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్ద పిల్లర్ కింద నిరీక్షిస్తున్నారు. ఆ సమయంలో పిల్లర్‌పైన ఉణ్న మెట్రో కాంక్రీటు అంచులు పెచ్చులూడి తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి మౌనిక తలపై పడ్డాయి. తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె మరణించారు.

ఈ ఘటనతో మెట్రో స్టేషన్ల పటిష్టతపై జనాల్లో సందేహాలు తలెత్తాయి. మెట్రో స్టేషన్ల నిర్మాణాల పై పలువురు విమర్శలు చేశారు. ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రమాదంపై ఇంజనీరింగ్ నిపుణులతో విచారణ చేయించాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఈ ప్రమాద ఘటనపై విచారణ ప్రారంభమైంది. ప్రమాదం జరిగిన స్థలాన్ని మెట్రో సేఫ్టీ కమిషనర్, ఇంజినీరింగ్ నిపుణులు పరిశీలించారు. ఈ విచారణలో హైదరాబాద్ ఐఐటీ ఇంజినీరింగ్ నిపుణుల సాయం తీసుకుంటున్నారు.

Related posts