telugu navyamedia
తెలంగాణ వార్తలు

పెళ్లి సందట్లో… ఈటెల క్రేజే వేరు…

తెలంగాణలో రాజకీయ పరిస్థితుల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజకీయనాయకుల ఇంట శుభకార్యానికి ప్రజాప్రతినిధుల సందడి చూపరులను ఆశ్చర్య పరచింది. కాంగ్రెస్ నాయకులు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుని వివాహ వేడుక రాజకీయ నాయకులతో సరికొత్తవాతావరణాన్ని తలపించింది.

సంకీర్త్ రెడ్డి, తరుణ్య ల పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు మాజీమంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హాజరయ్యారు. ఈటల క్రేజ్ ముందు కేటీఆర్ చిన్నబోయారు. ఎక్కడైనా మంత్రి కేటీఆర్ కనబడితేచాలు… యువకులు, అభిమానులు సెల్ఫీలు తీసుకోడానికి ఎగబడేవారు.

తాజాగా పెళ్లి వేడుకలో పరిస్థితి తారుమారైంది. కల్వకుంట్ల తారక రామారావుకు ఈటెల ఝలక్ ఇచ్చాడు. కనీ వినీ ఎరుగని రీతిలో క్రేజ్ సంపాదించుకున్నారు. పెళ్లి వేడుకలో పాలుపంచుకోడానికి వచ్చిన వారిలో అత్యధికులు ఈటెల రాజేందర్ ను చుట్టుముట్టారు. సెల్ఫీలతో సందడిగా మారడంతో… అదే పెళ్లి వేడుకకు ప్రత్యేక అతిథిగా వచ్చిన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చిన్నబోయారు. జనం సెల్ఫీలు దిగుతుంటే… పక్కకు తప్పుకుపోయారు.

Related posts