telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారీ వర్షాలతో .. అతలాకుతలం అవుతున్న కేరళ…

huge rains in kerala

గత పదిరోజులుగా కేరళ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఒకరు మరణించగా, మరో ఐదుగురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. కేరళ రాష్ట్రంలో గత నెల 21 నుంచి భారీవర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో వరదలు వెల్లువెత్తాయి.వరదల్లో లోతట్టుప్రాంతాలు మునిగిపోవడంతో 2,060 మందిని 20 సహాయ పునరావాస శిబిరాలకు తరలించారు.

కన్నూరు పట్టణంలో వరదల్లో ఒకరు మరణించారు. మరో 8 మంది జాడ లేకుండా పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తుపాన్ ప్రభావం వల్ల శుక్రవారం ఎర్నాకుళం, త్రిసూర్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కేరళలోని నాలుగు జిల్లాల్లో వాతావరణశాఖ ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది.

Related posts