telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

భారీ నష్టాలలో .. స్టాక్ మార్కెట్లు..

husge loses again in stock markets

దేశీయ మార్కెట్లు నేడు మరో భారీ నష్టాన్ని చవిచూశాయి. దానికి తోడుగా అంతర్జాతీయంగా కూడా ఎలాంటి సానుకూల ఫలితాలు లేకపోవటంతో నేడు నష్టాలతో మార్కెట్లు ముగిశాయి. నేడు ప్రధానంగా ఆటో స్టాక్ లు నష్టపోవడం మార్కెట్లపై తీవ్రంగానే ప్రభావం చూపిందని చెపుతున్నారు నిపుణులు. డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికానికి గాను రూ. 26,960.8 కోట్ల నెట్ లాస్ ను టాటా మోటార్స్ ప్రకటించడం, ఆ సంస్థ ఏకంగా 17.28 శాతం పతనమవడం లాంటి ఫలితాలు మార్కెట్ ను ఘోరంగా ప్రభావితం చేశాయి. దీనితో నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 424 పాయింట్లు పతనమై 36,546కు పడిపోయింది. నిఫ్టీ 125 పాయింట్లు నష్టపోయి 10,943కు దిగజారింది.

బీఎస్ ఈ సెన్సెక్స్ లో టాటా మోటార్స్, వేదాంత, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఎల్ అండ్ టీ కంపెనీలు భారీ నష్టాలతో ముగిశాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎయిర్ టెల్, హెచ్సీఎల్ ఎక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ లు టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

Related posts