ఇటీవల మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఎక్కువ అయ్యింది. దీనితో గస్తీ పెంచిన అధికారులకు మరోసారి భారీగా గంజాయి దొరికింది. ఓ కారులో అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా పాల్వంచ పోలీసులు తనిఖీల్లో భాగంగా పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు మండల పరిధిలోని ఇందిరా కాలనీలో తనిఖీలు నిర్వహించారు. వాహన తనిఖీల్లో భాగంగా ఓ కారులో సోదా చేశారు.
ఈ తనిఖీలో అధికారులు కారు డిక్కీలో 52 గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. పట్టుబడిన సరుకు విలువ రూ.16 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయిని ఒడిశా నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. కారులో ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.