BREAKING NEWS:
how to maintain healthy kidny

కిడ్నీ శుభ్రత ఇలా..!

55

శరీరాన్ని శుభ్రం చేసుకోడానికి రోజు రెండు సార్లు స్నానం చేస్తాము. మరి శరీరం లోపల శుభ్రం చేయడానికి అవసరమయ్యే అవయవం ఒకటి ఉంది, అదే కిడ్నీ. ఈ అవయువం శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచి దానికి గుండెకు చేర్చే ప్రక్రియలో ఆయా అవయవాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అటువంటి ముఖ్య పాత్ర పోషించే కిడ్నీని ఎలా జాగర్తగా చూసుకోవాలి.. అలా చేసుకోకపోతే ఏమవనుంది.. తెలుసుకుందాం.

కిడ్నీలు రక్తాన్ని శుబ్రపరిచే పనిలో ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది. రక్తంలో చేరే అనేక మలినాలను తొలగించే విధానంలో కిడ్నీలో ఆ మలినాలు పేరుకుపోయే అవకాశం ఉంది, తద్వారా అవి దీర్ఘకాలంలో రాళ్ళగానో, మరో కిడ్నీ సమస్యగానో పరిణమించి రోగాలకు కారణం అవుతున్నాయి.

మరి అటువంటి విలువైన అవయవాన్ని జాగర్తగా దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుకోడం ఎంతో అవసరం, కిడ్నీ పాడైపోయి మళ్ళీ కిడ్నీ మార్పిడి చేసుకుంటున్న వారిని నేటి కాలంలో కోకొల్లలుగా చూస్తూనే ఉన్నాము, అలాగే చాలా మందికి కిడ్నీ మార్పిడి చేసుకోడానికి లక్షలు పోసినా డోనర్ దొరక్క అలాగే అనారోగ్యంతో కాలక్షేపం చేస్తూనే ఉన్నారు.

మరి అనారోగ్యం పాలయ్యాక డబ్బు బోలెడంత పోసి వేరే కిడ్నీ అమర్చుకోవటం కన్నా ముందే ఉన్న అవయవాన్ని జాగర్తగా చూసుకుంటే సరిపోతుంది కదా అనే చిన్న చిన్న విషయాలపై కనీస అవగాహనా కూడా లేకుండా ఉన్నాము మనందరం అంటే ఏమైనా అతిశయోక్తి ఉందా.!

కిడ్నీని ఆరోగ్యంగా కాపాడుకోడానికి :

రోజు తగినన్ని నీరు తాగాలి, ముఖ్యంగా దాహం వేసినప్పుడు ఏ కూల్ డ్రింక్ కాకుండా స్వచ్ఛమైన నీరు తాగటం అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే లేవగానే ఒకటి లేదా రెండు గ్లాసులు నీరు తాగితే మంచిది. అలాగే ఏదైనా తినేముందు కాకుండా తిన్నాక రెండు గంటల తరువాత నీరు తాగటం అలవాటు చేసుకోవాలి. మీరు తగినన్ని నీరు తాగారా లేదా అనేదానికి ఒకే ఒక పరీక్ష మీరు మూత్రం పోసినప్పుడు అది ఎక్కువగా దుర్వాసన వచ్చిందంటే మీరు తగినన్ని నీరు తాగనట్టే.

how to maintain healthy kidny1

పండ్లు, కూరగాయలు ఆహారంలో తీసుకోవాలి. ముఖ్యంగా ద్రాక్షా, నారింజ, అరటి, సపోటా వంటి పొటాషియం లభించే వి ఆహారంలో చేర్చుకోవటం ముఖ్యం. అలాగే పాలు, పెరుగు, వివిధరకాల బెర్రీస్ వంటివి మీకు అందుబాటులో ఉన్నవి ఆహారంలో తీసుకోవాలి.

బార్లీ గింజలు కూడా ఆహారంలో ఏదొక భాగంగా చేర్చుకుంటే కిడ్నీకే కాకుండా ఇతరత్రా ఆరోగ్య విషయాలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ గింజలను రాత్రి నీళ్లలో నానబెట్టి ఆ నీరు ఉదయాన్నే తాగటం వల్ల ఆ గింజల నుండి సంపూర్ణ శక్తీ మనకు లభిస్తుంది.

how to maintain healthy kidny2

కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే మద్యపానం, చాకొలేట్, టీ, కాఫీ లకు దూరంగా ఉండటమే మేలు. వీటన్నిటికంటే మజ్జిగలో నిమ్మరసం కలిపి తీసుకుంటే చాలా మంచిది, టీ కాఫీ ల కంటే ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది.

కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలనేట్టుగా…మన ఆరోగ్యం మన చేతులలో ఉండాలంటే కొన్ని నియమాలు పెట్టుకొని అలాగే ఆహారాన్ని ప్రణాళికా బద్దంగా తీసుకుంటే అదే ఆరోగ్యం. అలా కాదంటే ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ బ్రతికేయటమే…ఎవరి ఇష్టాయిష్టాలు వారివి కదా మరి.