telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హిందూపురం మున్సిపల్ కార్పొరేషన్ పదవి తెలుగుదేశం కైవశం

హిందూపురం మున్సిపల్ కార్పొరేషన్ పదవి తెలుగుదేశం కైవశం చేసుకొంది. చైర్మన్‌ గా అరవ వార్డు కౌన్సిలర్ రమేష్ కుమార్ ను కార్పొరేటర్లు ఎన్నుకున్నారు.

13 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరడంతో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమైంది.

హిందూపురం మున్సిపాల్టీలో మొత్తం వార్డులు 38 ఉన్నాయి, సోమవారం ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో 38 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు.

21 మంది కౌన్సిలర్లుతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే మద్దతుతో చైర్మెన్ గా రమేష్ కుమార్ ఎన్నిక అయినట్లు ఎన్నికల అధికారి ఆర్డీవో ఆనంద్ కుమార్ ప్రకటించారు. ఆరవ వార్డ్ కౌన్సిలర్ రమేష్ కుమార్ చైర్మెన్ గా ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు.

దీంతో టీడీపీ నేతలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు  సంబరాలు చేసుకున్నారు.

కాగా హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ ప్రారంభమైనప్పుడు నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు.

కౌన్సిలర్లు చేజారి పోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ క్యాంపు నుండి నేరుగా ఎమ్మెల్యే కార్యాలయంకు అక్కడ నుంచి మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చారు.

హిందూపురం మున్సిపాల్టీలో మొత్తం 38 వార్డలకు గానూ ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి టీడీపీ, బీజేపీ బలం 10 కాగా  13 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశంలో చేరారు.

టీడీపీ బలం 23కు చేరింది. వైఎస్సార్సీపీకి 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో గెలుపుపై తెలుగుదేశం పార్టీ ధీమా వ్యక్తం చేసింది.

చైర్మన్ ఎన్నిక సందర్భంగా పోలీసులు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హిందూపురంలో పోలీస్ 30 యాక్ట్ తో పాటు 144 సెక్షన్ విధించారు. అయితే విజయోత్సవ ర్యాలీ, డీజేలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

కాగా మున్సిపల్ ఛైర్మన్ పదవికి టీడీపీ నుంచి రమేష్ కుమార్, వైఎస్సార్సీపీ నుంచి వెంకట లక్ష్మి పోటీపడ్డారు.

Related posts