వచ్చే అమెరికా అధ్యక్ష పదవికి ఎంపీగా ఉన్, హిందూ మతానికి చెందిన తులసి గబ్బార్డ్ కూడా పోటీకి సై అంటున్నారు. 2020లో జరగనున్న ఆ దేశ అధ్యక్ష పదవికి ఆమె పోటీ పడనున్నారు. వైట్‌హౌజ్ రేసులో ఆమె ట్రంప్‌తో పోటీపడాలని నిశ్చయించుకున్నారు. దీని కోసం త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు ఆమె చెప్పారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన తులసి వయసు 37 ఏళ్లు. ఆ పార్టీ నుంచి అధ్యక్ష రేసుకు పోటీలో ఉన్న రెండవ మహిళగా ఆమె నిలిచారు. సేనేటర్ ఎలిజబెత్ వారెన్ కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు.
భారత సంతతికి చెందిన సుమారు 12 మంది 2020లో ట్రంప్‌కు పోటీ ఇవ్వాలనుకుంటున్నారు. దాంట్లో కాలిఫోర్నియా సేనేటర్ కమలా హారిస్ కూడా ఉన్నారు. తులసీ గబ్బార్డ్ నాలుగుసార్లు హవాయి నుంచి హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎంపికయ్యారు. ఇరాక్ యుద్ధంలో పనిచేసిన ఆమె.. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మొదటి హిందూ మహిళగా నిలవనున్నారు. చిన్నతనంలోనే గబ్బార్డ్ హిందూ మతాన్ని స్వీకరించారు. ఇండో అమెరికన్ల మధ్య ఆమె చాలా పాపులర్. ఒకవేళ అధ్యక్ష పదవికి ఎన్నికైతే ఆమె మొదటి క్రైస్తవేతర వ్యక్తిగా నిలవనున్నారు. వాస్తవానికి అమెరికా జనాభాలో హిందువుల సంఖ్య ఒక శాతం కన్నా తక్కువే. 2020లోనూ తానే రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు ట్రంప్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇకనైనా కేసులు వెనక్కి తీసుకోండి… బాబుకు పోసాని సూచన