hindu-priest-abused-a-girl

బాలింతపై పూజారి లైంగిక దాడి…

42

ఇంట్లో ఆరోగ్య సమస్యలొచ్చాయని, కుటుంబంలో ఒకరు చనిపోగా ఇంటికి ఏదైనా దృష్ట శక్తి పీడిస్తుందేమోనన్న అనుమానంతో ఇంటిని బాగు చేసుకుందామనే ఆలోచనతో పూజారిని సంప్రదిస్తే ఇంటికే శఠగోపం పెట్టాడు. వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలో ఉన్న రుద్రాక్ష పల్లి గ్రామంలో ఒక గిరిజన కుటుంబం ఇంటి పక్కనే తమ కులదైవాన్ని ఆరాధించడం కోసం చిన్న గుడి కూడా కట్టుకున్నారు. ఆ గుడి కట్టిన కొద్దిరోజులకే కుటుంబం అనారోగ్యం పాలవడం, ఒకరు మృతి చెందడంతో తీవ్ర ఆవేదనకు గురై శకునాలను సవరించుకుందామనే నిర్ణయంతో లక్ష్మి నర్సయ్య అనే పూజారిని కలిసి జరిగిన సంఘటనలు అతనికి వెల్లడించారు.

girl-abused-by-hindu-priest

అదే  అదునుగా భావించిన పూజారి ఇంటి ఆవరణలో ఉన్న ఉప్పలమ్మ గుడి కింద ఆరు లంకె బిందెలున్నాయని, వాటికీ దృష్ట శక్తి కాపలాగా ఉన్నాయని చెప్పి వాటివల్లే ఇంట్లో కలహాలు ఐతున్నాయని చెప్పాడు. లంకె బిందెలను వెలికి తీయడానికి పూజలు చేయాలని ఇంట్లో ఉన్న మూడు నెలల బాలింతపై పూజలో భాగమని నమ్మించి రెండు సార్లు లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. తనకు సహకరించకపోతే నీ భర్త ప్రాణాలకు హాని ఉందని భయపెట్టాడు. మొదటిసారి నిరాకరించడంతో, రెండవసారి పకడ్బందీగా వచ్చి భర్తకు మత్తు మందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి మళ్లీ అత్యాచారానికి పాల్పడగా మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి పూజారితో పాటు, వెంట వచ్చిన మరొక వ్యక్తిని పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మూఢనమ్మకాలతో ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు.