కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం విద్యాసంస్థల్లో హిజాబ్ పై నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని కొంత మంది ముస్లింలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. హిజాబ్ నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పునిచ్చింది.
విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌లపై సుప్రీం కోర్టు ఇవాళ(సోమవారం) విచారణ జరిగింది.
హిజాబ్ బ్యాన్ ఎత్తివేత అంశంపై వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును మళ్లీ సెప్టెంబర్ 5వ తేదీన విచారించనున్నట్లు కోర్టు తెలిపింది.
మంత్రిని చేస్తానని కేసీఆర్ మాట తప్పారు.. నాయిని సంచలన వ్యాఖ్యలు