high speed is dangerous

అతివేగం…ప్రమాదం…అని మరోసారి రుజువైంది…

41

మితిమీరిన వేగం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోగా మరొకరు గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరింగింది.  హైద్రాబాద్ షేక్ పెట్ లో నివాసం ఉంటున్న రాహూల్ రెడ్డి అనే యువకుడు ఇంజినీరింగ్ చదుతున్నాడు.  ఈ రోజు ఉదయం తన ఫ్రెండ్ ని గచ్చిబౌలి లో వదిలేసి షేక్ పెట్ లో తన నివాసానికి వెళ్తుండగా ఉదయం 3 గంటల 15 నిమిషాలకు  షేక్ పెట్ దర్గా దగ్గర కారు ఎలక్ట్రిక్ పోలుకి ఢీ కొట్టడంతో కారు 3 పల్టీలు కోటింది, డ్రైవింగ్ చేస్తున్న రాహూల్ రెడ్డి కి తీవ్ర గాయాలవడంతో స్థానికులు హాస్పిటల్ కు తరలించేలోపే మృతి చెందాడు, అతని స్నేహితుడు సాయి చరణ్ గాయాలతో బయటపెట్టాడు. ప్రస్తుతం అతను హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఓవర్ స్పీడ్, పైగా మలుపు చూడకపోవడం ఇంకా టైర్లు పేలడంతో పోలుకి గుద్దుకున్నారు అన్ని పోలీసులు చెప్తున్నారు. చాలా విలువైన కార్ అయినప్పటికీ అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్  ఉన్నా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినప్పటికీ రాహూల్ రెడ్డి ప్రాణాలు కాపాడలేక పోయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారా..లేదా…అన్ని పోలీసులు ఇంకా నిర్దారించలేదు. పోస్టుమాటం రిపోర్ట్ వస్తే గాని స్వష్టంగా చెప్పలేం అంటున్నారు పోలీస్ అధికారులు.

high-speed-is-dangerous

రాహూల్ రెడ్డి మరణానికి కారణమైన కారు తన తండ్రి అనంత రెడ్డి పేరు మీద వుంది. గతంలో పలు మారులు ఓవర్ స్పీడ్ కారణంగా పోలీసులు 5740 రూపాయలు దాక చలానాలు వేసినప్పటికీ ఎలాంటి మార్పు లేకుండ మితిమీరిన వేగంతో కారు నడుపుతూ ఈరోజు ప్రాణాల మీదికి కొని తెచ్చుకున్నాడు.

ఈ ఘటన చూసాక కనీసం సమాజంలో అతివేగంగా వెళ్లేవారు కాస్త జాగ్రత్తగా రూల్స్ పాటించి నిదానంగా పోతే ఎలాంటి నష్టం వాటిల్లదని అభిప్రాయపడుతున్నారు.