high court ordered corporator home

కార్పొరేటర్ ఇంటిని కూల్చేయండి : హై కోర్ట్

29

కరీంనగర్ లోని కోతిరాంపూర్ కాలనీ లో టి ఆర్ ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ రెండంతస్థుల భవనాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. పార్క్ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా అధికార పార్టీ కార్పోరేటర్ రూప్ సింగ్ ఇంటిని నిర్మించాడు.

దీనిపై స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి హై కోర్ట్ ని ఆశ్రయయించాడు, దాని పై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే ఆ ఇంటిని కూల్చివేయాలని మున్సీపాల్ అధికారులను ఆదేశించింది. సర్వే నెంబర్ 415 ఈ భూములని 1981లో ప్రభుత్వం యన్ జి ఓ లకు కేటాయించింది. అంధులో పార్క్ కోసం ఎకరం 30 గుంటలు స్థలాన్ని మున్సిపాలిటీ పేరు మీద రిజిస్టర్ చేసింది.

అయితే మున్సిపాలిటీ ఆదీనంలో ఉన్న స్థలంలో కొంత మంది గుడిసెలు వేసుకున్నారు, వాటిని తొలగించమని ప్రభుత్వం ఆదేశించిన అధికారులు ఏ ప్రయత్నం చెయ్యలేదు. అదే స్థలంలో కార్పొరేటర్ రూప్ సింగ్ 2015 లో ఇల్లు నిర్మించాడని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా నగరంలో అక్రణలపై మున్సీపాల్ అధికారులు ద్రుష్టి సాధించాలని స్థానికులు కోరుతున్నారు.