telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభుత్వం సొంతంగా ఓ స్టూడియోను నిర్మించవచ్చు కదా? : హైకోర్టు

TSHC

టాలీవుడ్ దర్శకుడు ఎన్.శంకర్ హైదరాబాదులో సినీ స్టూడియో నిర్మాణం కోసం భూమిని కేటాయించాలంటూ గతంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. దాంతో తెలంగాణ సర్కారు ఆయనకు రంగారెడ్డి జిల్లా మోకిల్లలో 5 ఎకరాల భూమిని కేటాయించింది. ఎకరం రూ.5 లక్షల చొప్పున కేటాయించింది. అయితే ఈ భూమి కోట్ల విలువ చేస్తుందని, అలాంటప్పుడు ఎకరాకు రూ.5 లక్షల చొప్పున దర్శకుడికి ఏ విధంగా కేటాయిస్తారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై హైకోర్టు ఇటీవల విచారణ చేపట్టింది. రూ.2.5 కోట్ల విలువైన భూమిని ఇంత తక్కువ ధరకు ఏ ప్రాతిపదికన కేటాయించారంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలంగాణ ఉద్యమంలో శంకర్ కీలక పాత్ర పోషించారని ఏజీ కోర్టుకు తెలుపగా… తెలంగాణ కోసం త్యాగం చేసిన వేల మందికి ఇలాగే ఇస్తారా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే హైదరాబాద్ లో అద్భుతమైన రామోజీఫిలిం సిటీ ఉందని హైకోర్టు గుర్తు చేసింది. ప్రభుత్వం సొంతంగా ఓ స్టూడియోను నిర్మించవచ్చు కదా? అని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ భూములను సినీపరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. క్యాబినెట్ నిర్ణయాలకు సహేతుకత ఉండాలని ప్రభుత్వం తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదని కోర్టు తెలిపింది. కౌంటర్ దాఖలుకు రెండు వారాలు గడువు ఇచ్చి విచారణను వాయిదా వేసింది హైకోర్టు.

Related posts