భూముల రిజిస్ట్రేషన్లను సులభం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై స్టేను మరోసారి పొడిగించింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు… ధరణిపై మధ్యంతర ఉత్తర్వులు జూన్ 21 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది… అయితే, ధరణిపై అభ్యంతరాలను మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తోందని హైకోర్టుకు తెలిపారు ఏజీ ప్రసాద్… ప్రభుత్వం వైఖరి తెలిపేందుకు సమయం కావాలని కోర్టును కోరారు.. కాగా, ధరణిపై దాఖలైన ఏడు పిల్స్ పై సీజే జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం విచారణ జరిపింది.. ఒకే అంశంపై అనేక పిటిషన్లు అవసరం లేదని అభిప్రాయపడింది హైకోర్టు.. ధరణిపై దాఖలైన 2 పిల్స్ పై మాత్రమే విచారణ జరుపుతామని.. మరో ఐదు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారణకు తోసిపుచ్చింది హైకోర్టు.. ఇప్పటికే పలుసార్లు ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై స్టే విధిస్తూ వచ్చిన హైకోర్టు.. ఈ సారి ఏకంగా ఐదు నెలల పాటు స్టే కొనసాగించింది. మరోవైపు.. ధరణి ద్వార వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా… వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు గతంలో అనుసరించిన విధానాన్నే కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post