దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ బృందానికి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నేతృత్వం వహించనున్నారు. వనపర్తి ఎస్పీ అపూర్వరావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, రాచకొండ ఎస్‌వోటీ డీసీపీ సురేందర్, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్, సంగారెడ్డి డీసీఆర్‌బీ సీఐ వేణుగోపాల్‌రెడ్డి ఈ బృందంలో సభ్యులు.
నిందితుల ఎన్‌కౌంటర్‌పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. మరోవైపు, ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు నేడు విచారించనుంది.