telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆసక్తికరంగా “అశ్వథ్ధామ” ట్రైలర్

Ashwatthama

యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న ‘అశ్వథ్ధామ’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను దర్శకుడు పూరీ జగన్నాథ్ విడుదల చేశారు. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన మెహిరిన్ నటిస్తున్నారు. ఈ మూవీని జనవరి 31న విడుదల చేయనున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ మూవీని ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు. రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీచరన్ పాకాల సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్ సమంత చేతుల మీదుగా ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌కు విశేష స్పందన లభించింది. “రాక్షసుడిని, భగవంతుడిని చూసిన కళ్లు ఇక ఈ ప్రపంచాన్ని చూసే అదృష్టాన్ని కోల్పోతాయి” అని చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ చిత్రం టైలర్.. ‘‘ఎటు వెళ్లినా మూసుకుపోతున్న దారులు.. ఒకరితో ఒకరికి సంబంధంలేని వ్యక్తులు.. వేట కుక్కల్లాగా వెంటపడే జాలర్లు.. శకునిలాంటి ఒక ముసలివాడు..వీళ్లందరిని ఒకే స్టేజ్ మీద ఆడిస్తున్న సూత్రదారి ఎవరు’’ అని చెప్పే నాగశౌర్య డైలాగ్‌తో ఎండ్ అయింది. యువతిని కిడ్నాప్ చేసి హత్య చేసిన సంఘటన నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. సస్పెన్స్, యాక్షన్, సీన్స్‌ ఈ మూవీపై అంచనాలు పెంచుతున్నాయి.

Related posts