telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ సీజన్ 3 .. మొదటి ఎలిమినేషన్ హేమ .. తమన్నా ఎంట్రీ..

hema is first elimination from bigg boss 3

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 లో ఫస్ట్ ఎలిమినేటర్ గా హేమ బయటకు వచ్చింది. మొదటి వారం మోనిటర్ గా ఉన్న హేమ ఇంట్లోకి వెళ్లిన రెండో రోజే ఫుడ్ ప్రిపేర్ చేసే విషయంలో రాహుల్ తో గొడవ పెట్టుకుంది. అంతేకాదు తను మాట్లాడింది తప్పని తెలిసినా సరే మిగతా ఇంటి సభ్యుల మాటలను పట్టించుకోకుండా తన దారి తనదే అన్నట్టు ప్రవర్తించింది. అందుకే ఇంట్లో హౌజ్ మెట్స్, బయట ఆడియెన్స్ అందరు హేమకు నెగటివ్ మార్కులు వేశారు. ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 3 మొదటి ఎలిమినేటర్ గా హేమ ఎలిమినేట్ అయ్యింది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 మొదటి వారం కోటి 30 లక్షల ఓట్లు వచ్చాయని వెళ్లడించాడు నాగార్జున. ఫైనల్స్ వరకు బాబా భాస్కర్, శ్రీముఖి వచ్చే అవకాశం ఉందని చెప్పారు హేమ.

ఇక హౌజ్ లో కన్నింగ్ ఎవరైనా ఉన్నారా అన్న నాగార్జున ప్రశ్నకు హేమ ఎవరు లేరు అందరు మంచి వాళ్లే అన్నారు హేమ. చివరగా వెళ్తూ తన వన్ వీక్ జర్నీ చూసి ఫీల్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 1 జ్యోతి ఫస్ట్ ఎలిమినేటర్ గా రాగా.. బిగ్ బాస్ 2లో సంజన ఫస్ట్ ఎలిమినేట్ అవడం జరిగింది. ఆదివారం ఎపిసోడ్ ఆటపాటలతో షో సందడిగా సాగింది. ఇంటి సభ్యులంతా ఎంతో ఉత్సాహంగా ఈ గేం లో పాల్గొన్నారు. ఇక మొదటి రెండు ఎపిసోడ్స్ లో కన్నా నాగార్జున యాంకరింగ్ కూడా కాస్త బెటర్ గా ఉందని చెప్పొచ్చు. హేమ ఎలిమినేట్ అయినా కూడా ఇంట్లో ప్రస్తుతం 15 మంది సభ్యులు ఉన్నారు. అదేంటి ఒకరు ఎలిమినేట్ అయినా 15 మంది ఎలా ఉంటారు అనుకోవచ్చు.. అక్కడే చిన్న ట్విస్ట్ ఉంది.ఇక సర్ ప్రైజ్ గా మొదటి ఎలిమినేటర్ అలా వెళ్లగానే ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తమన్నా సింహాద్రిని పంపించారు. ఒక ట్రాన్స్ జెండర్ అయిన తనని ఇలా బిగ్ బాస్ హౌజ్ లో సెలెక్ట్ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నాను అంటూ తమన్నా సింహాద్రి చెప్పారు.

Related posts