telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణలో భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరిక

తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.. అయితే, మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

రేపు అక్కడకక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని ప్రకటించింది. మరోవైపు.. ఈ నెల 6వ తేదీన ఉత్తర, మధ్య బంగా‌ళా‌ఖా‌తంలో అల్పపీ‌డనం ఏర్పడే అవకాశం ఉందని.. వీటి ప్రభా‌వంతో రాష్ట్రంలో శని‌వారం అతి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉందంటోంది వాతావరణ కేంద్రం. ఆది‌లా‌బాద్‌, కుమ్రంభీం, మంచి‌ర్యాల, నిర్మల్‌, నిజా‌మా‌బాద్‌, జగి‌త్యాల, రాజన్న సిరి‌సిల్ల, కరీం‌న‌గర్‌, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సిద్ది‌పేట, రంగా‌రెడ్డి, హైద‌రా‌బాద్‌, మేడ్చల్‌-మ‌ల్కా‌జి‌గిరి, వికా‌రా‌బాద్‌, సంగా‌రెడ్డి, మెదక్‌, కామా‌రెడ్డి, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నాగ‌ర్‌‌క‌ర్నూల్‌, వన‌పర్తి, నారా‌య‌ణ‌పేట, జోగు‌లాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురు‌స్తా‌యని తెలి‌పింది.

Related posts