దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఏకదాటి వర్షానికి నగరమంతా జలమయమైంది. రోడ్లపై నీరు నిలవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఓ ఫ్లై ఓవర్ మీద వరద ప్రవాహం ఎక్కువవడంతో వర్షపు నీరు కింద ఉన్న రోడ్డు మీదకు పారుతోంది. అయితే ఇది చూడటానికి అచ్చం జలపాతంలా కనిపిస్తోంది. ఆ దృశ్యాలను చూసిన కొంతమంది నయగార జలపాతం ఢిల్లీకి వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. వికాస్ పురి ప్రాంతంలోని ఫ్లైఓవర్ పై నుంచి వర్షం నీరు కిందకు పడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
గత 24 గంటల్లో ఢిల్లీలో 112.1 మిమీ వర్షపాతం నమోదైంది. అయితే ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ‘తూర్పు, ఆగ్నేయం, ఈశాన్య, ఉత్తర ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, దాద్రి, మీరట్, మోడీనగర్‌లోని ప్రదేశాల్లో తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ట్వీట్ చేసింది.
పార్టీ నుండి వెళ్లిపోతే పదవులకు రాజీనామా చేయాలి: కుంతియా