telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో ఈరోజు భారీ వర్షాలు!

3 days rain in telugu states

ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) స్పష్టంచేసింది. చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఇతర జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

27వ తేదీ ఉత్తరాంధ్ర జిల్లాలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 28వ తేదీ ఉత్తరాంధ్ర జిల్లాలు, తూర్పు, పశ్చిమ గోదావరి, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Related posts