telugu navyamedia
రాజకీయ

ఢిల్లీలో భారీ వర్షం..

దేశ రాజధానిని భారీ వాన ముంచెత్తింది. కేవలం మూడు గంటల్లో 73.2 సెంటీమీటర్ల వాన కురిసింది. దీంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ఎక్కడి ట్రాఫిక్‌ అక్కడ నిలిచిపోయింది. రోడ్లమీద భారీగా నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

In pictures: Heavy rains lead to water-logging at several places in Delhi | Business Standard News

లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో చాలా మార్గాల్లో రాకపోకలకు అంతరాయం కలిగింది. అండర్ పాస్ రహదారుల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు రాకపోకల నిలిపివేశారు. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.

గడిచిన 24గంటల్లో 13.8 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైందని, ఈ సీజన్ లోనే ఒక్కరోజులో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఢిల్లీలోని సష్దర్‌గంజ్‌ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 2.30 నుంచి 5.30 గంటల వరకు 73.2 సెంటీమీటర్ల వాన నమోదయిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Heavy rains lead to waterlogging, traffic jam in Delhi - The Economic Times Video | ET Now

మరో రెండు వారాలపాటు ఇదేవిధంగా వానలు కురుస్తాయని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు అధికారులు హెచ్చరించారు. భారీ వర్షంతో రోడ్లపైకి  వరదనీరు చేరడంతో మోటార్లతో అధికారులు వరద నీరు తొలగిస్తున్నారు.

Related posts