ప్రముఖ తెలుగు కమెడియన్ కన్నెగంటి బ్రహ్మానందానికి ఆదివారం గుండెపోటు వచ్చింది. కాస్త ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గుండెపోటు వచ్చిన సమయంలో ముంబైలో ఉన్న ఆయనను వెంటనే ఆసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కు తరలించారు. అక్కడ పనిచేసే ప్రముఖ హార్ట్ సర్జన్ రమాకాంత పాండా బ్రహ్మానందానికి పలు పరీక్షలు నిర్వహించి బైపాస్ సర్జరీ చేయాలనీ నిర్ణయించుకున్నారు.
ఆ తరువాత ఆయనకు బైపాస్ సర్జరీ చేసి, ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు స్థిరంగానే ఉందని వెల్లడించారు. సర్జరీ జరుగుతున్న సమయంలో ఆయన కుమారులు రాజా గౌతమ్, సిద్ధార్థ్ లు కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం వయసు 62 సంవత్సరాలు. ఆయన దాదాపు 1000కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానం సంపాదించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు బ్రహ్మనందం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
శిఖండిని అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తున్న బిగ్ బాస్… తూ… : శ్రీరెడ్డి