telugu navyamedia
ఆరోగ్యం

ప్రసవం తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే..

స్త్రీలకైతే బిడ్డకు జన్మనివ్వడం అనేది మరో జన్మతో సమానం అంటారు. స్త్రీకి ప్రెగ్నెన్సీ తొమ్మిది నెలల కాలంలో శరీరంలో చాలా మార్పులు జరుగుతాయని అందరికీ తెలుసు. చాలామంది మహిళలు ప్రసవం తర్వాత తమ ఆరోగ్యం విషయంలో అంతగా శ్రద్ధ తీసుకోరు. గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకున్న శ్రద్ధ, జాగ్రత్తలు కాన్పు జరిగిన తర్వాత వారు తీసుకోకపోవడంతో మహిళల్లో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. డెలివరీ తర్వాత ఇన్‌ఫెక్షన్‌, జ్వరం రావడం, యూరినరీ ప్రాబ్లమ్స్‌, బ్రెస్ట్‌ ప్రాబ్లమ్స్‌, నరాల్లో రక్తం గడ్డ కట్టడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని డెలివరీ తర్వాత మహిళలు ప్రసవానంతర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

Mother's Day special: Diet and nutrition tips for new moms | Health - Hindustan Times

అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి..?, ఎలాంటి ఆహరం తీసుకోవడం మంచిది అనేది చూసేద్దాం. ఇలా వీటిని ఫాలో అయితే మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. చాలా మంది తల్లులు బిడ్డ పుట్టిన తరువాత కనీసం మొదటి ఆరు వారాల వరకు తిరిగి ఎప్పటిలా పనులు చేసుకోలేరు. నిజానికి నిపుణులు చెప్పినదాని ప్రకారం మహిళలు ప్రసవించిన రెండో వారం నుంచే వ్యాయామం చేయొచ్చు. అయితే ఏదైనా కారణం వల్ల తల్లి సిజేరియన్ చేయించుకుంటే, గాయం పూర్తిగా నయం కావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి తల్లి ఆరోగ్య పరిస్థితిని బట్టి 2-3 నెలల తర్వాత వ్యాయామాలు చేయడం, మంచిది. వ్యాయామం వల్ల పొట్ట కండరాలు, పెల్విక్ కండరాలు దృఢమవుతాయి. నడుమునొప్పి తగ్గుతుంది. వ్యాయామం చేయడం ఎప్పటి నుండి మొదలు పెట్టాలి అనే విషయంలో డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

Mommy and Baby Exercises - Working Out With Your Baby

* రెగ్యులర్ గా తినడం
బాలింత సమతులాహారం తీసుకుంటేనే బిడ్డకి కూడా న్యూట్రియెంట్స్ అన్నీ అందుతాయి. డెలివరీ తర్వాత పాలిచ్చే మహిళలు 2100K క్యాలరీలు రోజుకి తీసుకోవాలి. అదే పాలు ఇవ్వకపోతే 400 నుండి 500 కేలరీలు తీసుకోవాలి.

*సమతుల్యమైన ఆహారం..
ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ మొదలైన పోషకాలు ఉండేటట్టు చూసుకోవాలి. కూరగాయలు, పండ్లు, నట్స్, గింజలు అన్నీ డైట్ లో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. అలానే నెయ్యి, ఆలివ్ ఆయిల్, అవకాడో, ఫిష్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఇవన్నీ బాలింతల డైట్ లో ఉంటేనే బిడ్డ ఆరోగ్యం బావుంటుంది.

MENU PLAN FOR LACTATING MOTHERS | My Cooking Diaries "CooklikeCecilia.com"

ఆకు కూరలు..
పాల కూర, బ్రకోలి వంటి ఆకు కూరలు విటమిన్ ఏ, విటమిన్ సీ, ఐరన్ తో నిండి ఉంటాయి. బాలింతలకి ఇవి చాలా అవసరం. పైగా వీటిలో క్యాలరీలు తక్కువ. కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి తల్లికీ బిడ్డకీ కూడా మంచి చేస్తాయి.

హైడ్రేషన్..
ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. కనీసం రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు తీసుకునేలా చూసుకోండి. అలానే డైరీప్రొడక్ట్స్ లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి వాటిని కూడా మీరు మీ డైట్ లో తీసుకోండి.

సీజనల్ ఫ్రూట్స్..
పండ్లలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ సీ సిజేరియన్ అయిన వారికి మంచి చేస్తుంది.

లిక్విడ్స్..
బాలింతలకి పాలు పడడానికి లిక్విడ్స్ కూడా అవసరం. వీరు డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే కూడా లిక్విడ్స్ కావాలి. అందుకే, నీటితో పాటూ జ్యూసులు, సూప్స్, పాలు, మజ్జిగ వంటివి బాగా హెల్ప్ చేస్తాయి.

Post Pregnancy Diet: 20 Must-have Foods For New Moms

వెల్లుల్లి..
బాలింతలకి వెల్లుల్లి చాలా మంచిది. ఇందు వల్ల పాలు పడతాయి. వెల్లుల్లి ఇమ్యూన్ సిస్టం ని బలోపేతం చేసి ఇన్‌ఫెక్షన్స్ ని దూరంగా ఉంచుతుంది.

కాఫీ, షుగరీ డ్రింక్స్ వంటి వాటిని అసలు తీసుకోవద్దు ఇలా డెలివరీ అయిపోయిన తర్వాత ఆహార విషయంలో ఈ మార్పులు చేస్తే తప్పకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు.

Related posts