telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఈ విషయాలు తెలుస్తే.. దానిమ్మ పండు తినకుండా ఉండలేరు

చాలామందిలో రక్తహీనత వుంటుంది. ముఖ్యంగా గర్బిణులు రక్తహీనత వల్ల ఇబ్బందులు పడుతుంటారు. రక్తశుద్ధికి, రక్తంలో ఎర్రరక్తకణాల పెరుగుదలకు దానిమ్మపండు మేలైనదిగా డాక్టర్లు చెబుతారు. దానిమ్మ పండ్లలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. వీటిలో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ప‌లు కీల‌క పోష‌కాలు ఉన్నాయి. ఇవి శ‌రీరానికి మంచిపోష‌ణ‌ను అందిస్తాయి. అంతేకాదు ప‌లు అనారోగ్య స‌మ‌స్యలను దూరం చేస్తాయి. దానిమ్మ పండ్లను రెగ్యుల‌ర్‌గా తింటే క‌లిగే లాభాలు ఏమిటో తెలుసుకుంటే మీరు దానిమ్మపండు తినకుండా ఉండలేరు.
* దానిమ్మ పండులో విటమిన్ ఎ, సి, ఇ, బి5, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి.
* దానిమ్మపండు తింటే వృద్ధాప్యాన్ని దూరం అవుతుంది. అల్జీమర్స్, బ్రెస్ట్, స్కిన్ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి.
* దానిమ్మలో సహజ యాస్పిరిన్ గుణాలు ఉంటాయి. దీంతో ఇవి రక్త సరఫరాను వేగవంతం చేయడంలో మెరుగ్గా పనిచేస్తాయి.
* రోజూ పావు కప్పు దానిమ్మ రసం రోజూ తాగితే గుండె భద్రంగా ఉంటుంది. రక్తశుద్ధి కలుగుతుంది.
* ఎముకల ఆరోగ్యానికి దానిమ్మ చాలా మేలు చేస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడే వారికి అత్యంత దివ్యమైన ఔషధం దానిమ్మ.
* లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. సంతాన సాఫల్యతను పెంచే శక్తి దీనికి ఉంది.
* గర్భస్థ శిశువుల పెరుగుదలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది.
* దానిమ్మ రసాన్ని శరీరం మీద రాస్తే అలర్జీలు, కీటకాలు కుట్టడం వల్ల వచ్చిన ద‌ద్దుర్లు మానిపోతాయి.
* గర్భిణీ మహిళలు రోజూ ఒక గ్లాస్ దానిమ్మ రసం తీసుకుంటే ఎంతో మంచిది. దీని వల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు తప్పుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
* వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్ల విరేచనాలతో బాధపడేవారికి ఇది మంచి మందు. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు నోటి పూత నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
* దానిమ్మ రసం అల్సర్లను నివారిస్తుంది. దంతాలు, చిగుళ్లను దృఢంగా చేస్తుంది.
* రుతుస్రావ సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకు దానిమ్మ రసం విరుగుడుగా పనిచేస్తుంది.
* దానిమ్మ రసం అంగస్తంభన సమస్యలను కూడా తొలగిస్తుంది. శృంగార పేరితంగా పనిచేస్తుంది. దానిమ్మ రసంలోని రసాయనాలు కొలెస్ట్రాల్ వల్ల జరిగే ప్రమాదాలను తగ్గిస్తాయి. రక్తపోటును తగ్గించే గుణం దీనికి ఉంది. రక్తనాళాలు మూసుకుపోకుండా చూస్తుంది. దీంతో గుండెకు మేలు జరుగుతుంది.
* క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. మూత్ర పిండాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.

Related posts