telugu navyamedia
ఆరోగ్యం

వాల్‌నట్స్ తింటే ఎన్నో లాభాలు

కరోనా కాలం కావడంతో ఆరోగ్యంపై ఇప్పుడు అందరూ శ్రద్ధపెడుతున్న మాట వాస్తవమే. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రోగనిరోధకశక్తి అధికంగా ఉంటే మహమ్మారి మన దరిచేరదని ఇప్పటికే చాలామంది నిపుణులు చెప్పారు. అనేక పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని తెలిపాయి. కాబట్టి ఆరోగ్యానికి అంతలా ప్రాధాన్యత ఇస్తున్నారు. అనేక రకాల వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

రోజూ వాల్‌నట్స్ తినడం వలన మనకు వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని కొన్ని పరిశోధనల్లో తెలిపాయి. హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో వెల్లడైంది. అంతేకాదు తరచూ వాల్‌నట్స్ తీసుకోవడంతో ఆయుష్షు కూడా పెరుగుతుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. వాల్‌నట్స్‌లో ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, భాస్వరం, రాగి, సెలీనియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. వీటితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వాల్‌నట్స్‌ను డ్రైఫ్రూట్స్ లో రాజు అని కూడా పిలుస్తారు.

ముఖ్యంగా వాల్ నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి. వాల్‌నట్ మెదడు ఆరోగ్యానికి జ్ఞాపకశక్తికి బాగా ఉపయోగపడుతుంది. రాత్రి 2 వాల్ నట్స్ ను నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే అనేక వ్యాధుల నుండి బయటపడటానికి ఇది దోహద పడుతుంది. రక్తంలో చక్కెర మరియు మధుమేహాన్ని నియంత్రించేందుకు సహాయపడుతుంది. రోజూ 2 నుండి 3 వాల్ నట్స్ ను తినేవారిలో టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

వాల్‌నట్స్ తినడంతో ఎముకలు, దంతాలు దృఢంగా అవుతాయి. వాల్‌నట్స్‌లో ఉండే ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం ఎముకలను ధృఢంగా చేయడానికి సహాయపడుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటంతో గుండెకు మేలుచేస్తుంది. అధిక రక్తపోటును నియంత్రించేందుకు దోహదం చేస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

వాల్‌నట్స్‌ తినడం వల్ల రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలుచెప్తున్నాయి. హార్మోన్లకు సంబంధించిన క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.

(గమనిక: ఇది కేవలం అవగాహనకు మాత్రమే. ఆరోగ్య సంబంధ సమస్యలకు వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

Related posts