HCA president Vivek will be in the high court

హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ వివేక్ కు  హై కోర్టులో చుక్కెదురు 

17
హైదరాబాద్ క్రికెట్  అధ్యక్షుడు వివేక్ కు పదవి విషయంలో  హైకోర్టులో చుక్కెదురైంది. హెచ్‌సీఏ పదవికి అనర్హుడన్న అంబుడ్స్‌మన్ తీర్పును హైకోర్టు సమర్థించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. మరోసారి పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీనితో  హెచ్‌సీఏ ప్రెసిడెంట్ పదవి వివేక్ కోల్పోనున్నారు.  2017లో హెచ్‌సీఏకు ఎన్నికలు జరిగనప్పటి నుంచి అధ్యక్ష, కార్యదర్శులు ఎన్నికపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వివేక్ ఎన్నిక చట్టబద్ధతపై పలువురు ప్రశ్నిస్తున్నారు. అంబుడ్స్‌మన్‌కు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి. 
 
మాజీక్రికెటర్ మహ్మద్  అజారుద్దీన్, మాజీ ఎంపీ హనుమంతరావు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. పరస్పర వాదనలు విన్న అంబుడ్స్‌మన్ మూడు నెలల క్రితం వివేక్‌ను అనర్హుడిగా ప్రకటించింది. వివేకానంద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారు. ఇది కేబినెట్ మంత్రి స్థాయి పోస్టు. జస్టిస్ లోదా సిఫార్సుల ప్రకారం వివేక్  హెచ్‌సీఏ పదవికి అనర్హుడు. గతేడాది హెచ్‌సీఏ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి వివేక్ నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన రోజునే ఆయనపై ఆరోపణలు వెల్లువిరిసాయి.