telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రేప్ కేసులో… ప్రముఖ నిర్మాతకు 23ఏళ్ల జైలు శిక్ష

harvey

ప్రముఖ హాలీవుడ్ నిర్మాత 67 ఏళ్ల హార్వే వీన్ స్టీన్ పేరు ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. వీన్ స్టీన్ దాదాపు 80 మంది నటీమణులపై వేధింపులకు పాల్పడ్డారనేది ఆయనపై ఉన్న అభియోగం. ఆయన వేధింపులకు కొందరు హీరోలు కూడా బలయ్యారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కేసు విచారణలో కొన్ని నేరాలు రుజువయ్యాయి. దీంతో అతడికి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది మాన్‌హట్టన్ క్రిమినిల్ కోర్టు. ప్రొడక్షన్‌ సహాయకురాలిగా పనిచేసిన ఒక మహిళ, నటికావాలన్న కలతో హాలీవుడ్‌లో అవకాశాలు వెతుక్కుంటున్న మరో మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో వీన్‌స్టీన్‌కు ఈ శిక్ష పడింది. గత రెండేళ్లుగా హార్వే వీన్ స్టీన్ పేరు మీడియాలో, వార్తల్లో నిత్యం వినిపిస్తూనే ఉంది. 2006లో మీమీ హలేయిని.. 2013లో జెస్సికా మన్ .. వీన్ స్టీన్ ఘాతుకానికి బలయ్యారని కోర్టుకు గతంలో నివేదిక అందింది. 12 మందితో కూడుకున్న న్యూయార్క్ జ్యూరీ ఫిబ్రవరిలో తీర్పు ఇచ్చింది. వేధింపులు నిజమేనని నిగ్గు తేల్చి వెంటనే జైలుకు పంపాలని గతనెలలోనే జ్యూరీ సభ్యులు ఆదేశించారు. ఇతర నేరాలు కూడా రుజువు కావడంతో… వీన్ స్టీన్‌కు మార్చి 11న.. 23 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. వీన్ స్టీన్‌కు హాలీవుడ్‌లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆయన సినిమాలకు ఆస్కార్ అవార్డులు కూడా లభించాయి.

Related posts