telugu navyamedia
రాజకీయ వార్తలు

డ‌బ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మ‌న్‌గా కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌!

Harshavardhan Central Minister

ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. . 194 సభ్య దేశాలున్న డబ్ల్యూహెచ్ఓ నిన్న సమావేశమైంది. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారత్ ను ఎన్నుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్ గా ఉన్న జపాన్ కు చెందిన డాక్టర్ హిరోకి నకటాని స్థానంలో హర్షవర్ధన్ బాధ్యతలను స్వీకరించనున్నారు.

ఈనెల 22వ తేదీన ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది. డ‌బ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ బోర్డులో మొత్తం 34 స‌భ్య దేశాలు ఉంటాయి. అయితే రెండు రోజుల క్రితం జ‌రిగిన డ‌బ్ల్యూహెచ్‌వో స‌మావేశాల్లో భార‌త్‌.. ఎగ్జిక్యూటివ్ బోర్డుకు ఎంపికైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మ‌న్‌గా ఉన్న జ‌పాన్ డాక్ట‌ర్ హిరోకి న‌క‌టాని స్థానంలో కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ వెళ్ల‌నున్నారు. హ‌ర్ష‌వ‌ర్ద‌న్ నియ‌మ‌కాన్ని డ‌బ్ల్యూహెచ్‌వోలోని 194 స‌భ్య‌దేశాలు అంగీక‌రించాయి.

Related posts