telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

తండ్రయిన ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య

Hardik

టీమిండియా ఆల్‌రౌండర్‌, ముంబై ఇండియన్స్ ఆటగాడు హార్దిక్‌ పాండ్య తండ్రి అయ్యాడు. తన జీవిత భాగస్వామి నటాషా స్టాన్‌కోవిచ్‌ ఇవాళ ఓ ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్ద ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలుపుతూ బుల్లి పాండ్య ఫొటోను పాండ్య ట్విట్టర్ లో పోస్ట్‌ చేశాడు. పలువురు క్రికెటర్లతో పాటు అభిమానులు పాండ్య దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో సెర్బియా నటి, మోడల్‌ నటాషాతో పాండ్య నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే నటాషా తో పెళ్లి జరిగిందా లేదా అనే విషయం పాండ్య ఎక్కడా చెప్పలేదు. నటాషా గర్భిణి అయినప్పటి నుంచి ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో ఆమెతో కలసి దిగిన ఫొటోలను పాండ్య షేర్ చేస్తూ వచ్చాడు. నటాషా బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఇంగ్లాండ్‌లో వెన్నునొప్పికి శస్త్రచికిత్స చేయించుకున్న పాండ్య ఆ తర్వాత కొద్ది నెలలపాటు ఆటకు దూరమయ్యాడు. ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ పర్యటనకు కూడా ఫిట్‌నెస్‌ సాధించలేదు. కరోనా లాక్‌డౌన్‌ తో ఐపీఎల్‌ వాయిదా పడడంతో పాండ్య తన కుటుంబ సభ్యులతో కలసి ఇంటి వద్దే ఉంటున్నాడు.

Related posts