telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

14 ఏళ్ల ముఖ్యమంత్రి.. అనుభవశాలి.. చంద్రబాబు నాయుడు !

chandrababu devansh

చంద్రబాబు…!
————
రాజమండ్రి వీటీ కాలేజి…!
గేటు బయట టీకొట్టు..!

“యన్టీఆర్ కూతురి పెళ్ళి..పెళ్ళికొడుకు ఏపీ మినిష్టర్..”! అన్నాడు ఒక మిత్రుడు…!
ఆసక్తి గా అతని వంక చూస్తే…గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ పెదాల మధ్య ..పొగ దట్టంగా సుడులు తిరుగుతూ గాల్లో కలుస్తుంది.

అతనే మళ్ళీ ..!

చంద్రగిరి ఎమ్మెల్యే..మినిష్టర్ “చంద్రబాబునాయుడు”..అన్నాడు.

యన్టీఆర్ కుమార్తె వివాహమంటే అందరికీ ఆసక్తే..!

అప్పటికే చంద్రబాబు గురించి సినిమాటోగ్రఫీ మంత్రి కాబట్టి ..సినిమా పత్రికల్లో చిత్రప్రారంభోత్సవాలు..ఇంకా సినిమాలకు సంబంధించిన వార్తల్లో చూస్తున్నాము.

అప్పటి ఏపీ ఎమ్మెల్యేలు అందరూ ఇందిరాగాంధీ గాలిలో గెలిచిన వారన్న అభిప్రాయం ఉండేది.
కారణం..మా చుట్టుపక్కల ఎమ్మెల్యేలు ఎవరూ అంత పేరున్న వారు కాకపోవటమే!

కాంగ్రెస్ వ్యతిరేకులం కాబట్టి సహజంగానే వారిమీద చిన్నచూపు..!

ఆయనొక మినిష్టరు..యన్టీఆర్ అల్లుడు..అదృష్టవంతుడనుకున్నాము.

తీక్షణ ధృక్కులు..కోరమీసం ..ఆజానుబాహువు..స్ఫరద్రూపి
అప్పటి నుండి ఆయన గురించిన వార్తలు ఆసక్తికలిగించేవి..!

తదనంతరం యన్టీఆర్ పార్టీ..టీడీపి ఆవిర్భావం..చంద్రబాబు ఏం చేస్తాడన్న కుతూహలం..!
ఆయన చంద్రగిరి నుండి కాంగ్రెస్ తరుపున పోటీ ..ఓటమి..!

అక్కడితో ఆయన గురించి ..ఒక చిన్న బ్రేక్ ..!

తర్వాత ..యన్టీఆర్ పదవీచ్యుతుడవ్వటం..ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం..!

రాష్ట్రం అట్టుడుకిన సమయం…!

దినదినం వార్తలు ఉత్కంఠ కలిగించేవి..ఉద్రేకం రగిలేది..!
చంద్రబాబు..తెరమీద కు వచ్చారు.

ఒక పక్క అధికారపార్టీ…పైన ఇందిరాగాంధీ..!

రాష్ట్రంలో కాంగ్రెస్ ముదర డెక్కలు..!
యన్టీఆర్ ..టీడీపి ఎమ్మెల్యేలని ముప్పు తిప్పలు పెడుతున్నారు.

అప్పుడు ..పిల్లల్ని ఎత్తుకు పోయే గద్దల బారి నుండి రక్షించుకునే కోడిలాగ ..పొదువు కున్నారు.
యన్టీఆర్ కు అండగా..మొత్తం తానై ముందుకు నడిపించారు.

ఆయనకు తోడుగా..వెంకయ్య..వామపక్షాలు ఉన్నాయి.
తిరిగి యన్టీఆర్ ముఖ్యమంత్రి కావటానికి శ్రమించారు.

తర్వాత పార్టీలో ..పని చేస్తూ..పార్టీ నిర్మాణం ..గ్రామస్దాయి నుండి పటిష్టపరిచారు.

తర్వాత వచ్చిన ఎన్నికల్లో పార్టీ ఓటమి..సభలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించి..ప్రభుత్వాన్ని నిలదీసి ..ఇరుకున పెట్టేవారు.

తర్వాత పార్టీలో అనేక పరిణామాలు..యన్టీఆర్ వ్యక్తిగతం కూడా వివాదస్పదం అయింది.
అధికార మార్పిడి..చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.

అప్పటికి వారు సమర్ధుడైన యువనాయకుడు..మంత్రిగా పనిచేసారు..ప్రజల్లో కూడా గుర్తింపు వచ్చింది కొద్దిగా..!

అయితే ప్రజాకర్షణ ..అనర్ఘళ వాగ్ధాటి లేదు.
ఆయనకు అది స్పష్టమైన లోపం..!

రాజును చూసిన కళ్ళతో మొగుడ్ని చూసినట్టు..!

యన్టీఆర్ స్ధానం లో ఈయన్ని ఊహించుకోలేకపోయారు..కొందరు పార్టీ సానుభూతి పరులు..యన్టీఆర్ వీరాభిమానులు…!

తర్వాత ఆయన్ని ఆయన తయారు చేసుకున్నాడు.

సెల్ఫ్ మేడ్ మేన్!

అతని లోని లోపాలు..క్రమశిక్షణ..పనితీరు తో అధికమించటానికి ప్రయత్నం చేసారు.

రాజకీయం కొత్తమలుపు తీసుకున్నది.
ఎన్నికలు..అధికారం లక్ష్యంగా ఉండే రాజకీయాలు అభివృధ్ది ..సంస్కరణలు..వైపు మారాయి.

అభివృధ్ది లో భాగంగా కొత్తమార్గాలు అన్వేషించారు.
సంస్కరణలకు..దార్శనికత తోడయింది.

పని చేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు..అదే ఆయన్ని తిరిగి ముఖ్యమంత్రి ని చేసింది.

దేశవిదేశాల పెట్టుబడులు..పాలనాపరమైన విధానాలు కొత్తపుంతలు తొక్కాయి.

ఆయన చేసిన..అభివృధ్ది..సంస్కరణ ఫలాలు ప్రజలకు పంచే లోపల ..అధికారం కోల్పోయారు.

ఆయన మస్తిష్కం నుండి..వచ్చిన ఆలోచనలు..దేశం ఆచరించింది.

రాష్ట్రం ఆర్ధికంగా నిలదొక్కుకుంది.

ఆనాటి నుండి..ఆయన ఎదుర్కున్న..అవమానాలు..విమర్శలు దేశంలో ఏ రాజకీయనాయకుడు ఎదుర్కుని ఉండరు.

సుదీర్ఘకాలం అధికారంలో లేకపోయినా..పార్టీని కాపాడుకున్నారు.
విభజిత ఆంధ్ర ను…అభివృధ్ది దిశగా ..పరుగులు తీయించారు.

విభజన గాయాన్ని..అతి స్వల్ప కాలంలో నయమయింది.

ఆయన యజ్ఞం చేసారు..యాగం నిర్వహించారు.

యాగఫలం ప్రజలకందించే లోపల…!

ప్రజలు ఒక్క ఛాన్సు కు ప్రలోభపడ్డారు.

పూలు చల్లిన చేతులు రాళ్ళు విసిరాయి.
పొగిడిన నోళ్ళు తెగిడాయి.
సహచరులు ..కులముద్ర వేసారు..అపవాదులు ఆపాదించారు.

ఓటమిని హుందాగా స్వీకరించారు..!

దారుణపరాజయం పట్ల విస్మయానికి గురయ్యారు..!

ప్రత్యర్ధుల మాటల దాడులు..కేడరు పై కుట్రలు..అక్రమ కేసులు..తిరిగి పోరాటానికి సిద్దమయ్యారు.

సభలో ఒంటరిని చేసిన వ్యాఖ్యలు..తన వద్ద పని చేసిన..తాను పెద్ద స్ధాయిలో కూర్చోబెట్టిన..ప్రాముఖ్యత ఇచ్చిన అధికారుల వ్యవహరించే తీరు మనస్దాపానికి గురిచేసింది.

రాష్ట్రం ..దేశంలో పరిణామాలు అవాక్కయ్యేలా ఉన్నాయి.

మధ్యయుగాల నాటి పరిస్దితులు.

తన కళ్ళముందు కలల సౌధం కూలిపోతుంటే..ఆవేదన చెందారు.

మధురస్వప్నాన్ని భగ్నం చేసారు..!

రాష్ట్రం సర్వనాశనం అవుతుంటే..చేష్టలుడిగి సాక్షిగా నిలవాల్సి రావటం మరింత క్షోభ..!

చంద్రబాబు ను హింసించాలనే..ప్రత్యర్ధులు పనిగట్డుకుని..ఆయన మానసపుత్రిక అమరావతి ని అతలాకుతలం చేసారు.

ప్రతిచర్య..ప్రతినిర్ణయం..చంద్రబాబు లక్ష్యంగా చేస్తున్నారు.

కేంద్ర రాష్ట్ర పెద్దలు..కి ఒకే లక్ష్యం..!

అన్నీ భరిస్తున్నారు..!

స్వపక్షం..విపక్షం..ప్రత్యర్దులు..మానసిక యుద్దం చేస్తున్నారు.

అతను రాజర్షి..!
అతను యోగి..!
అతను దూషణ భూషణ తిరస్కారాలకు అతీతుడు..!
అతను నిత్యకృషీవలుడు..!
నిరంతర శ్రామికుడు..!

అతనికి ఇప్పుడు అధికారం తృణప్రాయం..!

ఈ క్షణం..ఇవాళ ప్రజలకే అతను కావాలి..!

పధ్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి..!
పన్నెండేళ్ళు ప్రతిపక్ష నాయకుడు..!
జాతీయ స్ధాయి ప్రముఖ నాయకుడు..!

జీవితసాఫల్యం సాధించారు..!

చంద్రబాబు నాయుడు….దీర్ఘదర్శి..!

Related posts