telugu navyamedia
ఆరోగ్యం

జామ ఆకుతో జుట్టు నిగారింపు!

ప్రస్తుత కాలంలో జుట్టుకి సంబంధించిన పలు సమస్యలతో బాధపడుతున్నారు. ఒకప్పుడు వయస్సు పైబడిన వారిలో మాత్రమే ఈ సమస్యలు కనిపించేవి. కానీ మారిన ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా పాతికేళ్ల యువకులు కూడా ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పురుషులు మాత్రమే కాదు.. మహిళలు కూడా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ప్రతి రోజూ ఊడిపోతున్న జుట్టును చూసి ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యపై జామ ఆకులు చక్కగా పనిచేస్తాయి. జుట్టు ఊడకుండా కాపాడతాయి. కేవలం జుట్టు రాలడాన్ని నివారించడమే కాదు.. కొత్త జుట్టు పెరిగేందుకు కూడా జామ ఆకులు దోహదం చేస్తాయి. జుట్టు కుదుళ్లను బలంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతాయి. జామలో విటమిన్ బీ6 పుష్కలంగా ఉంటుంది. ఇది జట్టు కుదుళ్లను బలంగా చేసేందుకు దోహదపడుతుంది. జట్టు ఒత్తుగా పెరుగుతుంది. మరి జుట్టు రాలే
సమస్యను నివారించేందుకు జామను ఎలా వాడలో ఇక్కడ తెలుసుకుందాం.

*  ఒక గిన్నెలో నీళ్లు పోసి కొన్ని జామ ఆకులు వేసి బాగా మరిగించాలి. దాదాపు 20 నిమిషాల పాటు ఆకులను ఉడికించాలి. ఆ నీళ్లు చల్లార్చి గోరువెచ్చగా మారిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని తలపై బాగా మర్ధన చేయాలి.

* జామ ఆకుల నీటితో దాదాపు 10 నిమిషాల పాటు తల మొత్తం బాగా రద్దుకోవాలి. ముఖ్యంగా కుదుళ్ల వద్ద మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 గంటల పాటు అలాగే వదిలేయాలి. రాత్రి పడుకునే ముందు ఇలా మర్ధన చేసుకొని.. ఆ తర్వాత తలకు టవల్ చుట్టుకొని నిద్రపోవచ్చు. జుట్టు ఊడుతుందని ఏవేవో షాంపులు, నూనెలు వాడేబదులు ఇలా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటుందంట.

* 4-5 జామ ఆకులను, గుప్పెడు కరివేపాకులను మరుగుతున్న నీటిలో వేయండి. 10-15 నిమిషాలు మరగనిచ్చి, స్టవ్ పై నుండి దించండి. చల్లబడిన తరువాత మీ జుట్టును గోరువెచ్చని నీరుతో కడిగి తర్వాత ఈ మిశ్రమాన్ని పట్టించండి. 5నిమిషాల పాటు అలానే ఉంచి చల్లనీరుతో కడిగేయండి. నెరిసిన జుట్టుకి ఇలా జామ ఆకులను ప్రత్యేకమైన పద్ధతిలో వాడండి.

*చెంచా జామ ఆకుల పొడిని ½ చెంచా ఆపిల్ సిడర్ వెనిగర్ మరియు 3 చెంచాల రోజ్ వాటర్ తో కలపండి. దీన్ని మీ జుట్టు కుదుళ్ళకి, పాయల చివర్ల పట్టించండి. దీన్ని 30 నిమిషాలపాటు అలానే వదిలేసి షాంపూతో కడిగేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేసి మీ జుట్టు నిగారింపును తిరిగి పొందండి.

*5-6 జామ ఆకులను మరుగుతున్న నీటిలో వేయండి.10 నిమిషాల పాటు మరగనివ్వండి. ఆ మరిగిన నీటిని చల్లార్చి దీన్ని 2 చెంచాల ఆలివ్ నూనెతో కలపండి. ఈ మిశ్రమాన్ని జట్టు పై రుద్ది 30నిమిషాల పాటు అలానే ఉంచండి. ఆ తర్వాత మీ జుట్టును షాంపూతో కడిగేయండి. మీ ఎండిపోయిన జుట్టును వారానికోసారి ఈ చిట్కాను పాటించి అందంగా మార్చుకోండి.

*1చెంచా జామ ఆకులపొడిని 2చెంచాల ఉసిరినూనెతో కలపండి. జుట్టు మొదళ్ళలో మొత్తం మెల్లగా ఈ మిశ్రమాన్ని రాసి 30నిమిషాలు ఉండనివ్వండి. సాధరణ షాంపూతో దీన్ని కడిగేసి, కొంచెం కండీషనర్ ను రాయండి. వారానికోసారి ఇలా చేసి జుట్టు ఊడిపోవటాన్ని తగ్గించండి.

*రెండు చెంచాల జామ ఆకుల పొడిని 3 చెంచాల కొబ్బరినూనెతో కలపండి. దీన్ని జుట్టుకి రాసి, 30 నిమిషాల తర్వాత కొంచెం తీవ్రత ఉన్న షాంపూతో కడిగేయండి. చిక్కులేని జుట్టుకోసం, జామ ఆకులను ఈ పద్ధతిలో వారానికోసారి వాడండి.

*చెంచా జామ ఆకుల పొడిని ½ చెంచా ఆపిల్ సిడర్ వెనిగర్ మరియు 3 చెంచాల రోజ్ వాటర్ తో కలపండి. దీన్ని మీ జుట్టు కుదుళ్ళకి, పాయల చివర్ల పట్టించండి. దీన్ని 30 నిమిషాలపాటు అలానే వదిలేసి షాంపూతో కడిగేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేసి మీ జుట్టు నిగారింపును తిరిగి పొందండి.

Related posts